*దేశీయ టెలికం రంగంలోకి రిలయన్స్ జియో ప్రవేశం తరువాత నుంచి జోరందుకున్న టారిఫ్‌ల వార్ కొనసాగుతోంది. తాజాగా ప్రధాన ప్రత్యర్థులు ఎయిర్టెల్, జియోకు షాకిచ్చేలా వొడాఫోన్ అద్భుత ఆఫర్ ప్రకటించింది. తాజాగా, వొడాఫోన్ తన యూజర్లకోసం సూపర్ ఆఫర్ ప్రకటించింది. సిటీబ్యాంక్ భాగస్వామ్యంతో సరికొత్త ప్రీపెయిడ్ రీచార్జ్ ప్యాక్‌ను తీసుకొచ్చింది. ఇది వోడాఫోన్ ఎగ్జిస్టింగ్ యూజర్లు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
* సూక్ష్మ రుణ సంస్థ భారత్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్, గత మార్చి త్రైమాసికంలో రూ.321 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. 2017-18 ఇదే త్రైమాసిక లాభం రూ.211 కోట్లతో పోలిస్తే, ఇది 50 శాతం అధికం.
*గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో, స్థిరాస్తి సంస్థ డీఎల్ఎఫ్ రూ.436.56 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది.
*హైదరాబాద్ కేంద్రంగా మైనింగ్ రంగంలో కార్యకలాపాలు సాగిస్తున్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్ఎండీసీ లిమిటెడ్ విదేశాల్లో కార్యకలాపాల విస్తరణకు అనువుగా తగిన పర్యవేక్షణ విభాగాన్ని ఏర్పాటు చేస్తోంది.
*ఆన్లైన్లో డిజిటల్ నైపుణ్యాలను నేర్పించే సింప్లీలెర్న్ విస్తరణ దిశగా అడుగులు వేస్తోంది. పలు సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు తమకు అవసరమైన సరికొత్త డిజిటల్ నైపుణ్యాలను నేర్చుకోవడం వల్ల వారు వృత్తిపరంగా మరింత వృద్ధి సాధించే అవకాశం ఉంటుందని సింప్లీలెర్న్ వ్యవస్థాపకుడు, సీఈఓ కృష్ణకుమార్ తెలిపారు.
*బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల వంటి ఆర్థిక సంస్థల పర్యవేక్షణ, నియంత్రణ కోసం ప్రత్యేకంగా ఒక విభాగాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ఏర్పాటు చేయనుంది.
*విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (ఏఏఐ)ను ప్రత్యేక కంపెనీగా తీర్చిదిద్దేందుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం అందించిన రూ.656 కోట్ల మూలధనానికి సమానంగా షేర్లు కేటాయించాలని ఏఏఐను ఆర్థికశాఖ ఆదేశించింది.
*దక్షిణ కొరియా వాహన దిగ్గజం హ్యుందాయ్ కాంపాక్ట్ సెడాన్ విభాగంలోకి అడుగుపెట్టింది. కొత్త మోడల్ ‘వెన్యూ’ని విపణిలోకి విడుదల చేసింది. దీని ధర రూ.6.5- 11.1 లక్షలు (ఎక్స్- షోరూమ్ దిల్లీ)గా నిర్ణయించారు.
*ఐటీ సంస్థ టెక్ మహీంద్రా గత ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన త్రైమాసికానికి రూ.1,126.6 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది.
*ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మరో విలీన ప్రక్రియకు సన్నాహాలు మొదలైనట్లు తెలుస్తోంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)లో ఆంధ్రా బ్యాంక్ సహా మరో రెండు చిన్న ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేసేందుకు కసరత్తు జరుగుతోందని ఈ పరిణామాన్ని గమనిస్తున్న వర్గాలు పేర్కొన్నాయి.
ఐవోసీని వెనక్కి నెట్టిన అంబానీ-వాణిజ్య-05/22
Related tags :