మైనర్ బాలికతో శృంగారం జరిపినందుకు అమెరికాకు చెందిన ఓ వ్యాపారవేత్తకు ఐదేళ్ల జైలు శిక్ష పడింది. 15 ఏళ్ల బాలికతో సొంత జెట్‌లో ప్రయాణిస్తూ విమానాన్ని ఆటోపైలట్ మోడ్‌లో పెట్టి నిందితుడు ఈ చర్యకు ఒడిగట్టాడు. 53 ఏళ్ల స్టీఫెన్ బ్రేడ్‌లీ మెల్ అనే వ్యాపార వేత్త గతేడాది డిసెంబరులో ఈ నేరానికి పాల్పడగా, విచారణ అనంతరం కోర్టు మంగళవారం శిక్ష విధించింది. స్థానిక నిబంధనల ప్రకారం.. మైనర్‌తో అక్రమ సెక్స్, చైల్డ్ పోర్నోగ్రఫీ తదితర నేరాల క్రింద ఇతనికి కోర్టు శిక్ష విధించినట్లు స్థానిక వార్తా పత్రికలు పేర్కొన్నాయి. స్టీఫెన్ మెల్ ఓ బ్రోకరేజీ సంస్థ యజమాని. ఇతనికి సొంత విమానం ఉంది. బాధితురాలైన బాలిక తల్లి తన కుమార్తెకు పైలట్ పాఠాలు నేర్పాలని స్టీఫెన్‌ను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బాలికను ఒంటరిగా విమానంలో తీసుకెళ్లి స్టీఫెన్ ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఈయన మరో లైంగికపరమైన కేసులో కూడా నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసులో తీర్పు జులైలో వెలువడనుంది.
మరోవైపు స్టీఫెన్ ఛారిటీ కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటారు. పేద పిల్లలెవరైనా వైద్యం కోసం అమెరికాలో మరో చోటకు వెళ్లాల్సి వస్తే ఉచిత రవాణా సదుపాయం కల్పిస్తారు.
ఈ కామాంధుడికి విమానం కూడా అడ్డు రాలేదు
Related tags :