ఇంగ్లాండ్ జట్టులో చాలామంది మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. అందులో జోస్ బట్లర్ మాత్రం అత్యంత ప్రమాదకారని ఆసీస్ మాజీ సారథి రికీ పాంటింగ్ అన్నాడు. త్వరలో జరగబోయే ప్రపంచకప్‌లో అతడు అత్యంత కీలకమవుతాడని వెల్లడించాడు. ‘ఇంగ్లాండ్‌లో జోస్ బట్లర్ ప్రమాదకారి. రెండు మూడేళ్లుగా అతడు ఎలా మెరుగయ్యాడో చూశాను. రెండు మూడు సీజన్ల క్రితం ముంబయి ఇండియన్స్‌కు అతడు ఆడుతున్నప్పుడు కోచ్‌గా ఉన్నాను. అప్పుడతను అంతర్జాతీయ క్రికెట్‌లో తన ముద్రవేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇంగ్లాండ్ తరఫున గత 18 నెలలుగా టీ20, వన్డే, టెస్టుల్లో అతడి ఆట అద్భుతం. అందుకే బట్లర్ ప్రమాదకారి’ అని పాంటింగ్ అన్నాడు. ‘బట్లర్ కీపింగ్ చేయకపోవచ్చు గానీ మిడిలార్డర్‌లో మాత్రం ఊపేస్తాడు. మైదానంలో 360 డిగ్రీల్లో షాట్లు బాదేస్తాడు. వన్డే జట్టులో చివరి వరకు బ్యాటింగ్ చేసేవాళ్లు ఉండటమే ఇంగ్లాండ్ బలం. అందుకే ఇతర జట్లతో పోలిస్తే ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తోంది. బట్లర్, బెన్‌స్టోక్స్, మొయిన్ అలీ వంటి ఆటగాళ్లు 6, 7, 8 స్థానాల్లో హార్డ్ హిట్టింగ్ చేయగలరు కాబట్టే టాప్‌ఆర్డర్ విశ్వాసంతో ఆడుతోంది. అలవాటైన వాతావరణంలో ఆడటం ఇంగ్లాండ్‌కు కలిసొచ్చే అంశం’ అని పాంటింగ్ వెల్లడించాడు.
పాంటింగ్ దృష్టిలో అతడే ప్రమాదం
Related tags :