బొప్పాయిని ప్రతిరోజూ ఆహారంలో తీసుకుంటే చాలా మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. బొప్పాయిలో ఉన్న ఫైబ్రిన్ అనే పదార్థం శరీరంలో బ్లడ్‌క్లాట్స్‌ను నివారిస్తుంది. బ్లడ్‌క్లాట్స్ వల్ల గుండెజబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బొప్పాయి రక్త సరఫరాను మెరుగు పరచి, ఈ సమస్యను నివారిస్తుంది. బొప్పాయిలో విటమిన్ ఏ, విటమిన్ సి ఎక్కువగా ఉంటాయి. అందువల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలో ఉన్న బ్యాక్టీరియాను అరికడుతుంది. బొప్పాయి శరీరానికి తక్షణశక్తిని ఇస్తుంది. పేగులను శుభ్రం చేసి వ్యర్థాలను బయటకి పంపడంలో బొప్పాయి ప్రధానపాత్ర పోషిస్తుంది. ఇందులో ఉన్న ప్రొటీన్లు, ఖనిజాలు, విటమిన్లు అనేక ఆరోగ్య సమస్యలను అరికడతాయి. తరచూ జలుబు, జ్వరం, ఫ్లూతో బాధపడేవారికి బొప్పాయి పండు మంచి ఔషధం. బొప్పాయిలో రోగనిరోధక శక్తి గుణాలు జలుబు, జ్వరం అరికడతాయి. చర్మ సౌందర్యానికి బొప్పాయి ఎంతో మేలు చేస్తుంది. చిన్న వయస్సులోనే శరీరం ముడతలు పడడాన్ని నివారించి, చర్మానికి మంచి కాంతినిస్తుంది. చర్మంలో తేమను కాపాడడంలో బొప్పాయిది కీలకపాత్ర. దీనివల్ల చర్మ సమస్యలు దరిచేరవు. బొప్పాయి కంటిచూపును మెరుగు పరుస్తుంది. బొప్పాయిలో ఉన్న పీచు మలబద్ధకాన్ని నివారిస్తుంది.
బొప్పాయి వదలకుండా తినాలి
Related tags :