ప్రపంచ కప్‌ను సాధించే సత్తాగల మ్యాచ్ విన్నర్లు టీమిండియాలో ఉన్నారని మహిళల క్రికెట్ జట్టు సారథి మిథాలీ రాజ్ అన్నారు. పైగా ఎంఎస్ ధోనీ అనుభవం జట్టును ఫేవరెట్‌గా నిలిపిందని వెల్లడించారు. ఈ మేరకు ట్విటర్‌లో ఓ పోస్ట్ పెట్టారు. ‘ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌తో కలిసి సారథి విరాట్ కోహ్లీ జట్టును ముందుండి నడిపిస్తాడు. జస్ప్రీత్ బుమ్రా లాంటి పేసర్లు, మంచి స్పిన్నర్లు మనకు ఉన్నారు. అయితే భారీ స్కోర్లు చేసి ప్రత్యర్థిని పరుగులు చేయకుండా అడ్డుకున్న జట్టే మ్యాచ్‌లు గెలుస్తుంది. అంటే జట్టులో అన్ని విభాగాలు పటిష్ఠంగా ఉండాలి. మనకు ధోనీ రూపంలో అనుభవజ్ఞుడూ ఉన్నాడు. అందుకే ఏ ఒక్క ఆటగాడి గురించో చెప్పడం కష్టం. టీమిండియాలో చాలా మంది మ్యాచ్ విన్నర్లు ఉన్నారు’ అని మిథాలీ పేర్కొన్నారు. ‘ఈ మధ్య ముగిసిన ఐపీఎల్‌తో అన్ని జట్లు, ప్రధాన ఆటగాళ్లు ఫామ్‌లో ఉన్నారు. అందరూ ప్రపంచకప్ కోసమే ఎదురు చూస్తున్నారు. భారత్ ఫేవరెట్‌గా ఇంగ్లాండ్‌కు వెళ్తోంది. వన్డేల్లో, ఇతర ఫార్మాట్లలో టీమిండియా అదరగొట్టిన సంగతి తెలిసిందే. అయితే ఇంగ్లాండ్ అవకాశాలను కొట్టిపారేయలేం. వరుసగా 10-15 వన్డేల్లో విజయ దుందుభి మోగించింది. సొంత గడ్డపై ఆడుతున్నారు. ఒక భారతీయురాలిగా నేను భారత్‌కే మద్దతిస్తున్నాను’ అని మిథాలీ వెల్లడించారు.
మిథాలీ మనస్సులో మాట
Related tags :