Movies

రకూల్‌ను కూల్‌గా ఉంచేవాడు కావాలి

Rakul defines the three characteristics of her would be-tnilive telugu news international latest movie news - రకూల్‌ను కూల్‌గా ఉంచేవాడు కావాలి

‘నా భర్తలో ఈ మూడు క్వాలిటీలు ఉండాలి’ అంటున్నారు కథానాయిక రకుల్‌ప్రీత్ సింగ్‌. ఇటీవల ఆమె హిందీలో ‘దే దే ప్యార్‌ దే’ సినిమాతో మంచి హిట్‌ అందుకున్నారు. తమిళంలో సూర్య సరసన ఆమె నటించిన ‘ఎన్జీకే’ మే 31న విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రచారంలో భాగంగా రకుల్‌ మీడియాతో మాట్లాడారు. తెరపై తన పాత్ర ఎంత సమయం కనిపిస్తుందనేది ముఖ్యం కాదని, స్క్రిప్టులో పాత్ర ప్రభావం ముఖ్యమని అన్నారు. ‘ఎన్జీకే’లో తన పాత్ర ప్రత్యేకంగా ఉంటుందని చెప్పారు. అనంతరం విలేకరి కాబోయే భర్తకు ఎలాంటి క్వాలిటీలు ఉండాలని ప్రశ్నించగా.. ‘మొదటిది.. నాకు కాబోయే ఆయన కనీసం ఆరడుగులు ఉండాలి. నా భర్తను నేను తలెత్తి చూడాలి. నేను ఎత్తు పాదరక్షలు వేసుకున్నా.. ఆయన నా కన్నా పొడవుగా ఉండాలి. రెండోది.. ఆయనకి జీవితంపైన ప్యాషన్‌, ఓ లక్ష్యం ఉండాలి. ఉదయం వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చే అబ్బాయిల్లా తను ఉండకూడదు. ఆయనకి ముందు చూపు ఉండాలి. ఆయన గొప్ప వ్యక్తి కాకపోయినా.. చేసే పనులు గొప్పగా ఉండాలి. మూడోది.. ఆయనకి మంచి హాస్యచతురత ఉండాలి. నాలా సహజంగా, సరదాగా కలిసిపోవాలి’ అని రకుల్‌ తన మనసులోని మాటలు చెప్పారు.