ఆరు నెలలు… సరిగ్గా ఆరు నెలల క్రితం టాప్ గేర్‌లో దూసుకెళ్లిన కారు… ఒక్కసారిగా డౌన్ అయ్యింది. ఓ వైపు హస్తం.. మరో వైపు కమలం దూకుడుకు కారు జోరు తగ్గిపోయింది. రెండు వైపుల నుంచి కెరటాల్లా దూసుకొచ్చిన రెండు జాతీయ పార్టీల దూకుడు ముందు టీఆర్ఎస్ వెలవెలబోయింది.అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని జిల్లాల్లో దూకుడుగా వెళ్లిన కారు.. లోక్ సభ ఎన్నికల్లో బోల్తా పడింది. 16 సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేసిన టీఆర్‌ఎస్ ఆ దిశగా సాగడంలేదు. ఆ పార్టీ 9 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక సిట్టింగ్ ఎంపీ, కేసీఆర్ కుమార్తె ఓటమి దిశగా పయనిస్తుండటం టీఆర్‌ఎస్ వర్గాలను కలవరపెడుతోంది. ఇక దేశవ్యప్తంగా మాంచి ఊపుమీదున్న బీజేపీ తెలంగాణలోనూ అదే జోరు కొనసాగిస్తోంది. ఆదిలాబాద్, కరీంనగర్, సికింద్రాబాద్, నిజామాబాద్ స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ మూడు స్థానాల్లో ఘన విజయం సాధించింది.ఇక ఎంఐఎం ఒక స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతుంది.
కారు టైరుకు పంక్చరు
Related tags :