Movies

మిస్టర్ అదా

Adah Sharma As A Guy-TNILIVE-మిస్టర్ అదా

సినీ నటి అదా శర్మ తొలిసారిగా ఓ విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నారు. బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ‘మ్యాన్‌ టు మ్యాన్’ అనే చిత్రంలో అదా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. అయితే ఇందులో ఆమె లింగమార్పిడి చేయించుకున్న పురుషుడి పాత్రలో నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో మీసాలు పెట్టుకుని దిగిన ఫొటో షూట్‌ను సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. ఇలాంటి పాత్రలో ఇప్పటివరకు ఏ కథానాయికగా నటించలేదనే చెప్పాలి. ఈ చిత్రంలో నవీన్‌ కస్తూరియా కథానాయకుడి పాత్ర పోషిస్తున్నారు.సినిమాలో నవీన్‌.. అదా అందాన్ని చూసి ఇష్టపడతాడు. ఆమెను పెళ్లి చేసుకుంటాడు. తీరా చూస్తే ఆమె లింగమార్పిడి చేయించుకున్న పురుషుడని తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది? అన్నదే సినిమా కథ. సినిమా కథ వినగానే అదా ఒప్పుకొన్నారట. ఇలాంటి ఛాలెంజింగ్‌ పాత్రలు వస్తే భాషతో సంబంధం లేకుండా అన్ని చిత్రాల్లో నటిస్తానని వెల్లడించారు. తెలుగులో అదా.. ‘హార్ట్‌ ఎటాక్‌’, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ తదితర చిత్రాల్లో నటించారు.