*** కావల్సినవి:
మైదా- 3 టేబుల్ స్పూన్లు, కోడిగుడ్లు- 3, వెన్న- కప్పు, స్ట్రాబెర్రీలు- కప్పు, వెనిల్లా ఎసెన్స్- సగం టేబుల్ స్పూను, పంచదార- కప్పు, విప్పుడు క్రీమ్- కప్పు, పాలు- కప్పు
*** తయారీ:
* ముందుగా ఓ గిన్నెలో గుడ్ల తెల్ల సొనను తీసి గిలకొట్టి పక్కన పెట్టుకోవాలి.
* పొయ్యిపై బాణలి పెట్టి రెండు టేబుల్ స్పూన్ల వెన్న వేసి కరిగాక స్ట్రాబెర్రీ ముక్కలు, ముప్పావు కప్పు పంచదార వేసి దగ్గర పడే వరకూ ఉంచాలి.
* ఇప్పుడు మరో గిన్నెలో గుడ్ల పచ్చ సొనను తీసుకుని అందులోకి వెనిల్లా ఎసెన్స్, పావు కప్పు పంచదార, పాలు, టేబుల్ స్పూను వెన్న, మైదా వేసి బాగా కలపాలి. ఇదే మిశ్రమంలోకి ముందుగా తయారు చేసుకున్న గుడ్ల తెల్ల సొనను వేసి దోశపిండిలా తయారు చేసుకోవాలి.
* పొయ్యిపై పాన్ వేడి చేసి దానిపై కాస్త వెన్న వేయాలి. దీనిపై ముందుగా తయారు చేసుకున్న మిశ్రమాన్ని మందంగా వేసి రెండు వైపులా కాల్చుకోవాలి.
* ఇలా చేసుకున్న పాన్ కేకులను విప్పుడు క్రీమ్, ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న స్ట్రాబెర్రీ మిశ్రమాన్ని వేస్తూ ఒకదానిపై ఒకటి అమర్చుకుంటే స్ట్రాబెర్రీ పాన్ కేక్ రెడీ అయినట్లే.