జనసేన విశాఖ లోక్‌సభ అభ్యర్థి వి.వి.లక్ష్మీనారాయణ పరాజయం పాలయ్యారు. నిజాయతీపరుడైన పోలీసు ఉన్నతాధికారిగా, సీబీఐ మాజీ జేడీగా రాష్ట్ర ప్రజలకు సుపరిచితులైన ఆయనకు విశాఖ ఓటర్ల నుంచి మంచి స్పందనే లభించింది. విశాఖ గ్రామీణ ప్రాంతాల్లో వైకాపా గాలి విపరీతంగా వీయడంతో లక్ష్మీనారాయణపై ఆ ప్రభావం తీవ్రంగా పడింది. గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లను ఆకట్టుకోవడానికి స్థానికంగా సరైన నాయకత్వ వ్యవస్థ లేకపోవడంతో ఓట్లు పడలేదు. దీంతో ఆయన మూడో స్థానానికే పరిమితమయ్యారు. భాజపా దేశవ్యాప్తంగా సంచలన విజయాలు నమోదు చేసినప్పటికీ విశాఖ భాజపా అభ్యర్థిని పురందేశ్వరి ధరావతు కోల్పోయారు. 2009లో విశాఖ అభ్యర్థిగా కాంగ్రెస్ తరఫున విజయం సాధించిన ఆమె తాజా ఎన్నికల్లో స్వల్ప ఓట్లు మాత్రమే సాధించారు.
జేడీకి మూడోస్థానం
Related tags :