* మ్యూచువల్ ఫండ్స్(MF) వ్యాపారం నుంచి వైదొలిగి, తన జాయింట్ వెంచర్ భాగస్వామి నిప్పన్ లైఫ్ అసెట్ మేనేజ్‌మెంట్‌కు వాటాలు అమ్మేశామని రిలయన్స్ క్యాపిటల్ (ఆర్‌క్యాప్) ప్రకటించింది. రిలయన్స్ నిప్పన్ లైఫ్ అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ (ఆర్‌ఎన్‌ఏఎం)లో రెండు కంపెనీలకు 42.88 శాతం చొప్పున వాటాలు ఉన్నాయి.
*ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల దిగ్గజం సోనీ కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్పత్తుల విషయంలో అత్యున్నత ప్రమాణాలు పాటించే సోనీ ప్రతి వస్తువును భారత్‌లోనూ విడుదల చేస్తుంటుంది. అయితే, ఇక నుంచి ఈ జాబితాలో స్మార్ట్‌ఫోన్లు ఉండవు. భవిష్యత్‌లో సోనీ నుంచి విడుదలయ్యే స్మార్ట్‌ఫోన్లు భారత్‌లో విడుదల కావు. గత కొంతకాలంగా వరుస నష్టాలను చవిచూడటమే ఇందుకు కారణమని సమాచారం. దక్షిణ అమెరికా, దక్షిణాసియా, ఆఫ్రికా దేశాలపై ఇక నుంచి పెద్దగా దృష్టి సారించబోమని సోనీ తెలిపింది.
* దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. ఎన్‌డీఏ ప్రభుత్వ విజయాన్ని మార్కెట్లు ఇంకా ఆస్వాదిస్తున్నాయి. నేడు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 623 పాయింట్లు పెరిగి 39,434 వద్ద, నిఫ్టీ 187 పాయింట్లు పెరిగి 11,844 వద్ద ముగిసింది. ముఖ్యంగా ఎల్‌అండ్‌టీ, భారతీ ఎయిర్‌టెల్, స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీగా లాభపడ్డాయి. బీఎస్‌ఈ మిడికాప్ సూచీ 1.54శాతం లాభపడింది. ఇక స్మాల్‌కాప్ సూచీ కూడా 1.92శాతం లాభపడింది.
*మ్యూచువల్ ఫండ్ వ్యాపారం నుంచి వైదొలగుతున్నట్లు అనిల్ అంబానీ గ్రూప్‌నకు చెందిన రిలయన్స్ క్యాపిటల్ ప్రకటించింది.
*సువెన్ లైఫ్ సైన్సెస్‌కు చెందిన మసుపిర్డైన్ (సువెన్ 502) ఔషధంపై రెండో దశ క్లినికల్ పరీక్షలు దాదాపు చివరి దశకు చేరుకున్నాయి.
*కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే దేశ వృద్ధికి ఊతం లభిస్తుందని, విదేశీ పెట్టుబడులు వెల్లువలా వస్తాయని కార్పొరేట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇప్పుడు ఆ దిశగానే ఎన్‌డీఏ ప్రభుత్వం తిరిగి సంపూర్ణ మెజార్టీతో పాలన పగ్గాలు చేపడుతుండటంపై పలువరు హర్షం వ్యక్తం చేశారు.
మ్యుచువల్ ఫండ్స్ వ్యాపారానికి రిలయన్స్ గుడ్‌బై-వాణిజ్యం-05/24
Related tags :