Politics

నోటాకు కూడా బానే గుద్దారు

NOTA in 2019 elections in telugu states gets 1.9lakh votes-TNILIVE-నోటాకు కూడా బానే గుద్దారు

నోటాకు ఓట్లు పోటెత్తాయి. అభ్యర్థులు నచ్చక సుమారు 1.91 లక్షల మంది నోటాను ఎంచుకున్నారు. భువనగిరిలో సుమారు 5 వేల ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్‌‌ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలుపొందారు. అక్కడ కోమటిరెడ్డికి వచ్చిన మెజారిటీ కంటే 7 వేలు ఓట్లు ఎక్కువగా, అంటే 12,010 ఓట్లు నోటాకు వచ్చాయి. మల్కాజ్‌‌గిరిలో కాంగ్రెస్‌‌ అభ్యర్థి రేవంత్‌‌రెడ్డి సుమారు 10 వేల ఓట్లతో గెలిచారు. ఇక్కడ 17,867 మంది నోటాకు ఓట్లేశారు. ఈ నియో జకవర్గాల్లో నోటా ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.చేవెళ్లలో గెలిచిన అభ్యర్థి సుమారు 14 వేల ఓట్ల ఆధిక్యతను సాధించగా, అక్కడ నోటాకు 9,200 ఓట్లు వచ్చాయి. అత్యధికంగా వరంగల్‌‌లో నోటాకు 18,764 ఓట్లు, అత్యల్పంగా నిజామాబాద్‌‌లో 2,033 ఓట్లు పడ్డాయి. గత ఎన్నికల కంటే, 12 నియోజక వర్గాల్లో నోటా ఓట్లు పెరిగాయి. గత ఎన్నికల్లో నోటకు 1,54,992 ఓట్లు పడితే, ఈ సారి 23 శాతం ఎక్కువగా సుమారు 1,91 లక్షల ఓట్లు వచ్చాయి.