ఎన్టీఆర్, రామ్‌చరణ్ కథానాయకులుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ ఆర్ ఆర్’. రామ్‌చరణ్ సరసన ఆలియా భట్ నాయికగా నటిస్తోంది. ఎన్టీఆర్‌కు జోడీగా నటించే కథానాయిక ఎవరన్నది ఇంకా తేలలేదు. హాలీవుడ్ నటి డైసీ ఎడ్గార్ జోన్స్‌ని ఎంచుకున్నప్పటికీ కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఆమె తప్పుకుంది. అప్పటి నుంచీ ఎన్టీఆర్ పక్కన ఎవరు నటిస్తారనే ఆసక్తి కొనసాగుతూనే ఉంది. పలువురు బాలీవుడ్ తారల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అయితే ఎన్టీఆర్ కథానాయికని హాలీవుడ్ నుంచే దిగుమతి చేస్తారని ప్రచారం సాగుతోంది. హైదరాబాద్‌లో శివార్లలో తీర్చిదిద్దిన ఓ ప్రత్యేకమైన సెట్లో చిత్రీకరణ జరుగుతోంది. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. చిన్న విరామాలు మినహాయిస్తే, ఈ షెడ్యూల్ సుదీర్ఘంగా సాగబోతోందని తెలుస్తోంది. అజయ్ దేవగణ్, సముద్రఖని కీలక పాత్రల్లో నటిస్తున్నా ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు
తెలుగమ్మాయిలు పనికిరారా?

Related tags :