Videos

Terminator:Dark Fate Trailer Is Out

Terminator:Dark Fate Trailer Is Out

ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్‌ విజయం అందుకున్న ‘టెర్మినేటర్‌’ ఫ్రైంచైజ్‌ నుంచి వస్తున్న ఆరో చిత్రం ‘టెర్మినేటర్‌: డార్క్‌ ఫేట్’. టిమ్‌ మిల్లర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర ట్రైలర్‌ విడుదలైంది. టెర్మినేటర్‌ను పోలి ఉన్న రెవ్‌-9 (గేబ్రియల్‌ లూనా) డ్యానీ (నటాలియా రెయేస్‌)ను చంపాలని యత్నిస్తుంటాడు. డ్యానీని కాపాడేందుకు సారా కోన్నర్‌ (లిండా హ్యామిల్టన్‌), అసలైన టెర్మినేటర్‌ (ఆర్నాల్డ్‌ ష్వార్జ్‌నెగ్గర్‌)తో కలిసి సాయశక్తులా ప్రయత్నిస్తుంది. రెవ్‌-9 నుంచి సారా.. డ్యానీని ఎలా కాపాడింది? అన్నదే ఈ సినిమా కథ. పారామౌంట్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై జేమ్స్ కెమరూన్‌, డేవిడ్‌ ఎల్లిసన్‌ సంయుక్తంగా నిర్మింస్తు్న్నారు. నవంబర్‌ 1న సినిమాను ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.