సినిమా వేరు. రాజకీయం వేరు. ఇప్పుడు పవన్ కల్యాణ్ కు ఇది బాగా తెలిసొచ్చింది.. సినిమా క్రేజ్ తో ఓట్లును కొల్లగొడుతాననుకున్న పీకేకు కలలో కూడా ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. సామాజిక వర్గం, సినిమా అభిమానం, యువత గట్టెక్కిస్తారంటూ అంటూ లెక్కలేసుకున్న ఆయనకు ఓటర్లు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. ఏపీ ఎన్నికల్లో అసలేమాత్రం ప్రభావం చూపలేకపోయింది జనసేన పార్టీ. చాలా చోట్ల డిపాజిట్లు గల్లంతయ్యాయి. ఏకంగా పవన్ కళ్యాణే పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓటమి పాలయ్యారంటే ఆ పార్టీ పరిస్థితి ఎంత దారుణాతి దారుణంగా ఉందే అర్థం చేసుకోవచ్చు…అనుకున్నది ఒకటి..జరిగింది మరొకటి. ఏదో చేయాలనుకుంటే మరేదో జరిగిపోయింది.. ప్లాన్ రివర్స్ అయింది. సీన్ సిరిగిపోయింది..పార్టీ అధ్యక్షుడిగా తానే ఓడిపోతే బాగుండదని…ముందుజాగ్రత్తగా రెండు చోట్ల నుంచి బరిలోకి దిగారు పీకే. కానీ ఒక్కచోట్ల కూడా పరువు దక్కలేదు..భీమవరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ చేతిలో ఓటమి పాలైన జనసేనాని.. గాజువాకలో మూడో స్థానానికే పరిమితం అయ్యారు..రాజకీయ అనుభవం లేకపోవడం, ప్రచార సరళిలో ఆయన వ్యవహరించిన తీరే ఓటమికి ప్రధాన కారణంగా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. సాధారణంగా ఏ పార్టీ అయినా అధికార పక్షంతో పోరాడుతుంది. కానీ విచిత్రంగా పవన్ ప్రతిపక్షమైన వైసీపీని టార్గెట్ చేశారు. టీడీపీని, చంద్రబాబుని పల్లెత్తు మాట కూడా అనని…పవనుడు జగన్ పై మాత్రం దుమ్మెత్తిపోశాడు… దీంతో జనం పవన్ కూడా చంద్రబాబు తాను ముక్కే అని డిసైడ్ అయిపోయారు. కర్రుకాల్చి వాతపెట్టారు…స్పాట్…ఏపీలో ఘోర పరాజయంపై పవన్ స్పందించారు..రెండుచోట్ల ఓడిపోయినా, తాను మాత్రం ప్రజల్లోనే ఉంటానని స్పష్టం చేశారు. జగన్ మోహన్ రెడ్డికి,ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపారు..రాజోలు ప్రజలు జనసేన పరువు కాపాడారు…తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలు నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థి రాపాక వరప్రసాద్ గెలుపొందారు. చివరి రౌండ్ వరకూ ఉత్కంఠ పోరు నడిచిన ఇక్కడ స్వల్ప మెజార్టీతో వరప్రసాద్ బయటపడ్డారు. మొత్తానికి ఈ గెలుపుతో జనసేనకు కూడా అసెంబ్లీలో చోటు దక్కింది..
అక్కడ పరువు పాయే. ఇక్కడ అడ్రస్ గల్లంతు.
Related tags :