చంద్రబాబు హయాంలో గత ఐదు సంవత్సరాల నుండి ఒక వెలుగు వెలిగిన అమెరికాకు చెందిన ప్రవాసాంధ్రులు డా. వేమూరి రవి తిరుగు ముఖం పట్టారు. తెదేపా అధికారం కోల్పోవడంతో వారి హయాంలో ప్రభుత్వం నియమించిన పలువురు రాజీనామా బాట పట్టారు. ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ అధ్యక్ష, ఎన్‌ఆర్‌టీ వ్యవహారాల సలహాదారు పదవులకు వేమూరు రవి శుక్రవారం రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యంకు రాజీనామా లేఖను పంపారు. డా.వేమూరి రవి లోకేష్ కు ముఖ్య సహచరుడిగా మెలిగారు. లోకేష్ తరపున చాలా వ్యవహారాలు డా.వేమూరి రవి చక్కదిద్దారు. లోకేష్ కు బీనామిగా ఉంటూ చాలా వ్యాపార వ్యవహారాలు నడిపినట్లు ప్రజల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏపీఎన్నార్తీలో గత ఐదు సంవత్సరాల నుండి జరిగిన కోట్లాది రూపాయల లావాదేవీల పైనా, ఇతర ఒప్పందాల పైనా వైకాపా ప్రభుత్వం విచారణకు సిద్దమవుతున్నట్లు సమాచారం. చంద్రబాబు హయాంలో కీలకంగా వ్యవహరించిన ఏపీ ఎన్నార్టీ వ్యవహారాల పై పూర్తీ స్థాయి దర్యాప్తు జరపాలని మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ప్రభుత్వాన్ని కోరినట్లు సమాచారం.
అమెరికాకు తిరుగుముఖం పట్టిన డా.వేమూరి రవి-TNI ప్రత్యేకం
Related tags :