Movies

ఏం పీక్కుంటారో పీక్కోండి!

Director Teja on changing Sita Movie Title-tnilive - sita teja movie warnings

‘సీత’ టైటిల్‌లో ఎలాంటి మార్పులు చేయనని తేల్చి చెప్పారు దర్శకుడు తేజ. కాజల్‌ అగర్వాల్, బెల్లంకొండ శ్రీనివాస్‌ జంటగా నటించిన చిత్రమిది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే సినిమాకు ‘సీత’ పేరు పెట్టడంతో కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. టైటిల్‌ మార్చాలని, సినిమాను తమకు చూపించిన తర్వాతే విడుదల చేయాలని అంటున్నారు. దీని గురించి తేజ మీడియా ద్వారా మాట్లాడుతూ..‘ ‘సీత’ కాకపోతే శూర్పణఖ అని టైటిల్‌ పెట్టాలా? నేనెందుకు మార్చాలి టైటిల్‌? నేను అస్సలు మార్చను. ‘సీత’ సినిమా ఇలాగే ఉంటది. సెన్సార్‌ బోర్డు కూడా సర్టిఫికేట్‌ ఇచ్చేసింది. కాబట్టి నేను ఎవ్వరికీ సినిమా చూపించాల్సిన అవసరం లేదు. కచ్చితంగా రేపు విడుదల చేస్తాను. ఎవడు ఆపుతాడో చూస్కుంటా’ అని హెచ్చరించారు.