మహిళలకు ఒత్తయిన కురులే అందం.. ప్రస్తుతం పొల్యూషన్ కారణంగా, ఒత్తిడి కారణంగా జుట్టు పలుచబడుతున్నది. వెంట్రుకలు ఊడిపోతున్నాయి. తెల్లబడుతున్నాయి. కురులు పట్టుగా మెరవాలంటే ఈ చిన్న చిట్కాలు పాటిస్తే చాలు..
– పార్లర్‌లో జుట్టును స్ట్రెయిట్‌గా చేయడానికి, కర్లీగా షేప్ చేయడానికి వాడే మిషన్ల నుంచి ఎక్కువ ఉష్ణోగ్రత విడుదలవుతుంటుంది. దీంతో జుట్టు పొడిబారిపోతుంది. ఇలా కాకుండా ఉండాలంటే షేప్ చేయించుకోవడానికి ముందే స్ప్రే, సీరం, క్రీం వంటి వేడి నుంచి రక్షించే ఉత్పత్తులను జుట్టుకు ఐప్లె చేసుకోవడం మంచిది.
– బ్లో డ్రయర్స్, ఫ్లాట్ ఐరన్స్, కర్లింగ్ ఐరన్స్ కురులకు ప్రొటీన్లు అందకుండా చేసి అందులో ఉండే సహజమైన ఆయిల్స్‌ను కోల్పోయేలా చేస్తాయి. డ్రయర్‌తో జుట్టు ఆరబెట్టుకుంటే అందులో కురులు తేమ కోల్పోయి పొడిబారుతాయి.
– అయానిక్ బ్లో డ్రయర్‌ని వాడడం వల్ల జట్టుకు పటుత్వం లభిస్తుంది. మంచి షాంపులోలే వాడాలి. సహజ సిద్ధమైన నూనెల వల్ల కురులు మెరుపును సంతరించుకుంటాయి. షాంపూల్లో ఉండే హానికరమైన రసాయన పదార్థాలు ఈ నూనెల్ని పోగొడుతాయి. అందుకని పాత పద్ధతిలో కుంకుడు కాయలను నానబెట్టుకుని షాంపూగా వాడడం మంచిది.
– ఇప్పటి వరకూ జుట్టుకు రంగు వేయని వారు భవిష్యత్‌లో రంగు వేద్దామనుకుంటే అమ్మోనియా, పెరాక్సైడ్ లేని రంగును ఎంచుకోవడం మంచిది. ఎందుకంటే అమ్మోనియా ఉండే రంగులు జట్టులో సహజంగా ఉండే తేమను పోగొడుతాయి. జుట్టుకు వేసే రంగుకు ఎలాంటి వాసనా లేకపోతే అందులో అమ్మోనియా కలవనట్లే.
– ఈత కొట్టేటప్పుడు టోపీ ధరించడం మంచిది. ఎగ్‌వైట్, స్ప్రౌట్స్, చేపలు ఎక్కువగా తీసుకోవడం వల్ల జుట్టుకు ప్రొటీన్లు లభిస్తాయి. వాల్‌నట్స్, ఫ్లాక్స సీడ్స్‌ను ఆహారంలో తీసుకోవడం వల్ల జుట్టుకు ప్రొటీన్లు అధికంగా లభిస్తాయి. వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి.