DailyDose

కోడి కత్తి శ్రీనివాస్ విడుదల-నేరవార్తలు–05/25

May 25 2019 - Daily Crime News - Kodi Kathi Srinivas Released

* వైకాపా అధినేత జగన్‌పై విశాఖ విమానాశ్రయంలో కోడికత్తితో దాడి చేసిన నిందితుడు శ్రీనివాస్‌ బెయిల్‌పై విడుదలయ్యాడు. ఏడు నెలల రిమాండ్‌ తర్వాత రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి బయటకు వచ్చాడు. అనంతరం మీడియాతో మాట్లాడాడు. ప్రజా సమస్యలను కొన్నింటిని పేపర్‌పై రాసుకొని వాటిని వివరించేందుకు జగన్‌ వద్దకు వెళ్లానని శ్రీనివాస్‌ తెలిపాడు. ఆ కంగారులో జగన్‌కు కత్తి తగిలిందని చెప్పుకొచ్చాడు.
* శ్రీళైలం సాక్షి గణపతి ఆలయం వద్ద కారు బీభత్సం సృష్టించింది. కొత్తగా కొన్న కారు వాహన పూజ పూర్తి చేసుకుని నిమ్మకాయలు తొక్కించే క్రమంలో అదుపుతప్పి ఆలయంలోని భక్తులపైకి దూసుకెళ్లింది. క్యూలైన్‌ వద్ద తీర్థ ప్రసాదాలు తీసుకుంటున్న ఐదుగురు భక్తులు ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనకు కారణమైన పూజారిపై అదేవిధంగా కారుపై స్థానికులు దాడి
* పెట్రోల్‌ బంక్‌లో చోరీ జరిగింది. ఈ ఘఠన జగిత్యాల జిల్లా కొడిమ్యాల నమిలికొండలోని పెట్రోల్‌ బంక్‌లో చోటుచేసుకుంది. దొంగలు పెట్రోల్‌ బంక్‌లో నగదు లాకర్‌ను ఎత్తుకెళ్లారు. రూ. 9 లక్షల నగదు చోరీకి గురైనట్లుగా పెట్రోల్‌ బంక్‌ యజమాని వెల్లడించాడు. ఖాళీ లాకర్‌ను కొండగట్టు సమీపంలోని మామిడి తోటలో పడేసి పారిపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
*పొలంలో కూలీ పనులకు రావటం లేదని జరిగిన ఘర్షణలో వ్యక్తి మృతిచెందిన సంఘటన కేటీదొడ్డి మండలం చింతలకుంట గ్రామంలో చోటు చేసుకుంది.
* కావలి ఉత్తర శివారులోని రుద్రకోట దాటాక రైలు పట్టాల పక్కనే గుర్తు తెలియని మృతదేహం శుక్రవారం లభ్యమైంది.
*అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని మండల కేంద్రమైన బ్రహ్మసముద్రం బస్టాండ్‌ ప్రాంగణంలో ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహానికి గురువారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు నిప్పు పెట్టారు.
*పూతలపట్టు మండలం వావిల్‌తోట తెదేపా ఎంపీటీసీ సభ్యుడు గోపి ఇంటిపై గురువారం రాత్రి వైకాపా కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు.
*పిడుగుపాటుకు గురై ఆదిలాబాద్‌ జిల్లాలో ఇద్దరు యువకులు మృత్యువాతపడ్డారు. నేరడిగొండ మండలం తేజాపూర్‌ గ్రామానికి చెందిన తెడ్డు గంగయ్య(32), బోథ్‌ మండలం రెండ్లపల్లికి చెందిన నైతం మారుతి(27)లు వ్యవసాయ కూలీలు. పని కోసం గురువారం ఉదయం పొలానికి వెళ్లారు.
*తమిళనాడులోని పొల్లాచిలో జరిగిన అత్యాచారం కేసులో అయిదుగురిపై సీబీఐ శుక్రవారం కోయంబత్తూరు ప్రత్యేక న్యాయస్థానంలో తొలి అభియోగపత్రం దాఖలు చేసింది.
*దొంగతనం చేశాడనే ఆరోపణలతో ఓ వృద్ధుడిని గేటుకు కట్టేసిన ఘటన సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారం పురపాలక సంఘం కార్యాలయంలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది.
*ఎగుమతి చేసేది నాసిరకం బంగారం ఆభరణాలు. కానీ వీటిని కొనుగోలు చేస్తున్న విదేశీ సంస్థ మాత్రం అసలు ఆభరణాల ధరనే చెల్లిస్తోంది. దీనిపై దర్యాప్తు ప్రారంభించగా నిధుల మళ్లింపు వ్యవహారంలో భాగంగానే ఈ కథ నడుస్తోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హాంకాంగ్‌ కేంద్రంగా జరుగుతున్న ఈ వ్యవహారం గుట్టురట్టు చేసేందుకు డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారులు ప్రయత్నిస్తున్నారు.
*ఎవరెస్టు శిఖరంపై నెలకొన్న అత్యంత రద్దీ కారణంగా అలసట, నిస్సత్తువ ఆవహించి ముగ్గురు భారతీయులు మృత్యువాత పడ్డారు. ఈ ఏడాది సీజన్‌ ప్రారంభం నుంచి ఇప్పటి వరకూ 15 మంది పర్వతారోహకులు ఇలా చనిపోయినట్లు నేపాల్‌ అధికారులు తెలిపారు.
*నాటుకత్తిని బ్యాగులో పెట్టుకొని విశాఖ విమానాశ్రయంలోకి వచ్చిన ప్రయాణికుడ్ని సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది పట్టుకున్నారు. భద్రతా సిబ్బంది తనిఖీల్లో ప్రయాణికుడి బ్యాగులో నాటుకత్తి బయటపడింది.
*దొంగతనం చేశాడనే ఆరోపణలతో ఓ వృద్ధుడిని గేటుకు కట్టేసిన ఘటన సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారం పురపాలక సంఘం కార్యాలయంలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది.
*టీవీ9 సంస్థ వాటాల వివాదంలో ఆ సంస్థ మాజీ సీఈవో రవిప్రకాశ్‌ కోసం సైబరాబాద్‌ పోలీసులు గాలింపు విస్తృతం చేశారు.
*గుజరాత్‌లోని సూరత్‌లో సర్తానా ప్రాంతంలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ కోచింగ్‌ సెంటర్‌ భవనంలోని రెండో అంతస్తులో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగాయి.
* బంధువుల ఇంట్లో వివాహ ఖర్చుల నిమిత్తం డ్రా చేసిన రూ.లక్ష నగదును బస్సు ఎక్కుతుండగానే చోరీకి గురైన సంఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఆర్టీసీ ప్రాంగణంలో శుక్రవారం చోటుచేసుకుంది.
* ఎన్నికల విధుల కోసం వెళ్లిన ఓ జవాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన త్రిపురలోని ధలై జిల్లాలో శుక్రవారం చోటు చేసుకుంది.
* కుటుంబ కలహాలతో భార్యను గొడ్డలితో నరికి భర్త హత్య చేసిన ఘటన వరంగల్ రూరల్ జిల్లా పరిధిలోని వర్ధన్నపేట మండలం కట్య్రాల గ్రామంలో వెలుగు చూసింది. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. రాయపర్తి మండలం కొత్తూరు గ్రామానికి చెందిన సుక్క దూడయ్య, కొమురమ్మల కుమార్తె మల్లికాంబ(43)ను కట్య్రాల గ్రామానికి చెందిన చెవ్వళ్ల యాదగిరికి ఇచ్చి 25 ఏళ్ల క్రితం వివాహం జరిపించారు.
*గుజరాత్‌ రాష్ట్రం సూరత్‌లోని కోచింగ్ సెంటర్‌లో శుక్రవారం సాయంత్రం జరిగిన అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య 20కి చేరింది. ఈ ఘటనకు కారణమైన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.