ఫేస్ బుక్ ఖాతాదారుల వివరాలు బహిర్గతం చేయాలనీ ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వాల నుంచి విన్నపాలు వెల్లువెత్తుతున్నాయి. అంతకుముందుతో పోలిస్తే ఏడు శాతం పెరిగాయని కాలిఫోర్నియా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఈ సామాజిక మాధ్యమం ఓ ప్రకటనలో తెలిపింది. 2018 ద్వితీయ భాగంలో అమెరికా తరువాత భారతదేశం నుంచి ఈ వినతులు ఎక్కువగా వచ్చాయని పేర్కొంది. పారదర్శకతకు తమ కంపెనీ కట్టుబడి ఉందని పేర్కొంటూ తాజా పారదర్శకత నివేదికను పేస్ బుక్ గురువారం విడుదల చేసింది. 2018 ద్వితీయార్ధంలో ప్రపంచ వ్యాప్తంగా ఖాతాదారుల సమాచారం బహిర్గతం చేయాలనీ కోరుతూ 1,10,634 అభ్యర్ధనలు ప్రభుత్వాల నుంచి వచ్చాయని ఫేస్ బుక్ ఇంటిగ్రిటి ఉపాధ్యక్షుడు గైరోసిస్ తెలిపారు. అంతకుముందు ఈ అభ్యర్ధనలు 1,03,815 మాత్రమేనని చెప్పారు.
ఫేస్‌బుక్‌పై మరో సెగ
Related tags :