కథానాయిక సాయిపల్లవి నటించింది కొన్ని సినిమాల్లోనే అయినా దక్షిణాదిలో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. మాలీవుడ్‌తోపాటు టాలీవుడ్, కోలీవుడ్‌లోనూ రాణిస్తున్నారు. అగ్ర కథానాయకుడు సూర్యకు భార్యగా సాయిపల్లవి నటించిన సినిమా ‘ఎన్జీకే’. రకుల్‌ప్రీత్ సింగ్ మరో కథానాయిక. సెల్వరాఘవన్ దర్శకత్వం వహించారు. మే 31న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రచారంలో భాగంగా సాయిపల్లవి ఓ మీడియాతో మాట్లాడారు. ఓ సీన్‌లో తను నటించిన విధానం దర్శకుడికి నచ్చలేదని అన్నారు. దీంతో చాలా బాధపడ్డానని తెలిపారు.
నేను మంచి నటిని కాదేమో!
Related tags :