తాప్సి ప్రధాన పాత్ర పోషించిన చిత్రం ‘గేమ్ ఓవర్’. తెలుగు తమిళ భాషల్లో వై నాట్ స్డూడియోస్ సంస్థ నిర్మిస్తోంది. ఎస్.శశికాంత్, చక్రవర్తి రామచంద్ర నిర్మాతలు. అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహించారు. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. వచ్చే నెల 14న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా తాప్సి మాట్లాడుతూ ‘‘నా సినీ ప్రయాణంలో మరో వైవిధ్యభరితమైన పాత్ర దొరికింది. కథ వింటున్నప్పుడే ఇదో కొత్త ప్రయత్నం అనిపించింది. కేవలం కథపై ఉన్న నమ్మకంతోనే ఈ సినిమా చేశాం. ‘పింక్’, ‘ఆనందో బ్రహ్మ’లాంటి చిత్రాల తరవాత నా సినిమాలపై ప్రేక్షకుల్లో ఎన్నో కొన్ని అంచనాలు ఏర్పడుతున్నాయి. వాటిని అందుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. ‘గేమ్ ఓవర్’ కూడా ఆ చిత్రాల జాబితాలో చేరుతుంద’’న్నారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘‘మా సంస్థ నుంచి వచ్చిన ‘గురు’, ‘లవ్ ఫెయిల్యూర్’ చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ‘గేమ్ ఓవర్’ కూడా ఆ స్థాయిలోనే ఉంటుంది. తాప్సికి ఈ చిత్రం మంచి పేరు తీసుకొస్తుందని నమ్ముతున్నామ’’న్నారు.
సమాప్తం
Related tags :