నేటి తరుణంలో చాలా మందిని ఊబకాయ సమస్య ఇబ్బందులకు గురి చేస్తున్నది. అధిక బరువు కారణంగా అనేక అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలోనే బరువును తగ్గించుకోవడం కోసం చాలా మంది అనేక పద్ధతులు పాటిస్తున్నారు. అయితే అధిక బరువు తగ్గాలంటే.. ఆహారం విషయంలోనూ జాగ్రత్తలు పాటించాలి. బరువును పెంచే ఆహారాలు కాకుండా బరువును తగ్గించే ఆహారాలు తినాలి. ఇక బరువును తగ్గించే ఆహారాల విషయంలో పండు మిరపకాయలు ముఖ్యపాత్ర పోషిస్తాయి. వాటిని తినడం వల్ల అధిక బరువు తగ్గవచ్చని సైంటిస్టులు చేపట్టిన పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. పండు మిరపకాయలను తరచూ తినడం వల్ల అధిక బరువు తగ్గవచ్చని అమెరికాలోని వెర్మోంట్ యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. ఈ మేరకు వారు 16వేల మందిపై పరిశోధనలు చేశారు. దీంతో తేలిందేమిటంటే.. పండు మిరపకాయలను తరచూ తినడం వల్ల అధిక బరువు తగ్గుతారని సైంటిస్టులు నిర్దారించారు. అలాగే పండు మిరపకాయలను బాగా తినేవారికి హార్ట్ ఎటాక్‌లు, పక్షవాతం వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయని వారు చెబుతున్నారు. పండు మిరపకాయల్లో ఉండే క్యాప్సెయిసిన్ అనే సమ్మేళనం రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేసి శరీరంలో ఉండే బాక్టీరియా, ఇతర క్రిములను నాశనం చేస్తుంది. దీంతో మనకు ఆయుష్షు కూడా పెరుగుతుందని సైంటిస్టులు చెబుతున్నారు..!
పండు మిరపకాయలు పసపస నమలండి
Related tags :