Movies

రజనీకి వ్యతిరేకంగా

Sunil Shetty As Villain Against Rajinikanth in Durbar

రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం దర్బార్. మురుగదాస్ దర్శకుడు. నయనతార కథానాయిక. ఇటీవలే ముంబయిలో కీలక షెడ్యూల్‌ను పూర్తిచేశారు. ఈ చిత్రంలో రజనీకాంత్ ఐపీఎస్ అధికారిగా, సాంఘిక ఉద్యమకారుడిగా రెండు భిన్న కోణాలు కలిగిన పాత్రలో కనిపించనున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ప్రతినాయకుడిగా బాలీవుడ్ సీనియర్ నటుడు సునీల్‌శెట్టి నటించబోతున్నారు. రజనీకాంత్ వంటి సూపర్‌స్టార్ చిత్రం కావడంతో పాటు తన పాత్ర చిత్రణ నచ్చడంతో సునీల్‌శెట్టి ఈ సినిమాలో నటించడానికి అంగీకరించారని చెబుతున్నారు. త్వరలో ఆరంభమయ్యే సెకండ్ షెడ్యూల్‌లో సునీల్‌శెట్టి పాల్గొంటారని సమాచారం. వచ్చే ఏడాది సంక్రాంతికి దర్బార్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.