Movies

ప్రయత్న లోపం లేదు

The interesting cute story of disha patani and tiger shroff-TNILIVE

బాలీవుడ్‌ నటులు టైగర్‌ ష్రాఫ్‌, దిశా పటానీ ప్రేమలో ఉన్నారని గత కొన్ని రోజులుగా వదంతులు ఉన్న విషయం తెలిసిందే. దీనికి తగ్గట్టు ఇద్దరు అనేక సందర్భాల్లో జంటగా మీడియా కంటపడ్డారు. తమ ప్రేమ గురించి వీరిని ప్రశ్నిస్తే మాత్రం ‘మంచి స్నేహితులం’ అంటుంటారు. తాజాగా ఓ అభిమాని ఇదే ప్రశ్న దిశాను అడిగారు. ‘మీ మధ్య ప్రేమను ఎందుకు ఒప్పుకోరు. మీరు భార్యాభర్తలు కావడం అందరికీ ఇష్టమే’ అని పోస్ట్‌ చేశారు. దీనికి దిశా స్పందించారు. ‘గత కొన్నేళ్లుగా టైగర్‌ను ఇంప్రెస్‌ చేయడానికి ప్రయత్నిస్తున్నా. ఇప్పుడు ‘భారత్’ సినిమాలో నటించా. అందులో చాలా స్టంట్స్‌, డ్యాన్స్‌ చేశా.. అది చూసైనా అతడు ఇంప్రెస్‌ అవుతాడని ఆశించా. కానీ అవలేదు.. నా దురదృష్టం. మేమిద్దరం తినడానికి కలిసి హోటల్‌కు వెళ్తాం. దానర్థం తనకు నేనంటే ఇష్టమని కాదు. ఈసారి అతడితోనే మాట్లాడండి. అతడికీ సిగ్గే, నాకూ సిగ్గే.. చొరవ తీసుకుని చెప్పలేం’ అని అన్నారు.