DailyDose

లాభాల్లో స్టాక్ మార్కెట్లు-వాణిజ్య-05/27

May 27 2019 - Daily Business News - Indian markets gain

*కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు కానున్న నేపద్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంటు బలపడనుంది. దీంతో స్టాక్ మార్కెట్లు దూకుడును ప్రదర్శించింది. 350 పాయింట్లకు పైగా లాభపడింది. ప్రస్తుతం సెన్సెక్స్ 216 పాయింట్లు ఎగిసి 39,656 వద్ద నిఫ్టి సైతం 71పాయింట్లు, బలపడి 11,915 వద్ద త్రేడవుతుంది. తొలుత ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో దేశీ స్టాక్ మార్కెట్;లు స్వల్ప హెచ్చు తగ్గుల మధ్య ప్రారంభమయ్యాయి తదుపరి
* దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ఆరంభంలో కాస్త ఒడిదుడుకులు కనిపించినా వెంటనే పుంజుకుంది. కానీ మిడ్‌ సెషన్‌ తరువాత అమ్మకాలు పుంజుకోవడంతో వెనుకబడినా, చివరికి పటిష్టంగా ముగిసింది. సెన్సెక్స్‌ 249 పాయింట్లు ఎగిసి 39683వద్ద, నిఫ్టీ81 పాయింట్లు లాభపడి 11824 వద్ద ముగిసింది.
* గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఇండియా సిమెంట్స్‌ సంస్థ రూ. 44 కోట్ల నికర లాభం ప్రకటించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో లాభం రూ. 35 కోట్లు. మరోవైపు ఆదాయం రూ. 1,402 కోట్ల నుంచి రూ. 1,581 కోట్లకు పెరిగింది. సిమెంటు అమ్మకాలు గణనీయంగా పెరగడం ఆర్థిక ఫలితాలు మెరుగుపడేందుకు తోడ్పడిందని సంస్థ వైస్‌ చైర్మన్‌ ఎన్‌ శ్రీనివాసన్ తెలిపారు.
*పతంజలి గ్రూపును యూఎన్‌ఎస్‌డీజీ హెల్త్‌ కేర్‌ పురస్కారం వరించింది. ఆరోగ్య రక్షణలో ప్రపంచంలో అత్యంత ప్రభావవంతులైన 10 మందికి ఐక్యరాజ్య సమితి అభివృద్ధి లక్ష్యాల విభాగం యూఎన్‌ఎస్‌డీజీ ఏటా ఈ అవార్డుల ప్రదానం చేస్తోంది. ఈసారి అవార్డుల ప్రదానోత్సవం స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో జరిగింది.
*జీఎస్‌టీ రిఫండ్‌ల పరిశీలన, మంజూరు ప్రక్రియ వేగవంతం చేయాలని ఆర్థిక శాఖ యోచిస్తోంది. ఇందుకోసం ఆగస్టు నాటికి ఒకే వ్యవస్థను అమల్లోకి తీసుకురావాలని భావిస్తోంది.
*అంకుర సంస్థలు నియంత్రణ అనుమతులు సులభంగా పొందేందుకు, వీలుగా సమ్మతి సమయాన్ని నెలకు ఒక గంటకు తగ్గించాలనే ప్రతిపాదనను వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని పరిశ్రమల ప్రోత్సాహం, అంతర్గత వాణిజ్య విభాగం (డీపీఐఐటీ) తెరపైకి తెస్తోంది.
*100 విమానాలతో రాకపోకలు సాగిస్తున్న సంస్థగా, చౌకధరల విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌ నిలిచింది. బోయింగ్‌ 737 విమానాన్ని జతచేర్చుకోవడంతో సంస్థ వద్ద ఉన్న విమానాలు 100కు చేరాయి.
*పసిడి జూన్‌ కాంట్రాక్టు కిందటి వారం రూ.31,679 వద్ద నష్టాలతో ఆరంభమైంది. అమెరికా ఫెడ్‌ సమావేశాన్ని దృష్టిలో ఉంచుకుని ట్రేడర్లు ముందుజాగ్రత్తతో అమ్మకాలకు దిగడంతో కాంట్రాక్టు దిద్దుబాటుకు లోనై గురువారం రూ.31,232 స్థాయికి దిగివచ్చింది.
*టెక్‌ దిగ్గజం హువావేపై అమెరికా విధించిన ఆంక్షలపై చైనా రగిలిపోతోంది. దీంతో అమెరికా కంపెనీలపై ప్రతీకారం తీర్చుకొనేందుకు చట్టాలకు పదును పెడుతోంది.
*ఏదైనా ఆసక్తికర వీడియో చూడాలన్నా, లేదా యూట్యూబ్‌లో మంచి సినిమా చూస్తున్నా.. వచ్చే ప్రకటనలు, కాస్త అసహనంగా అనిపిస్తాయి. కొన్ని యాడ్‌లను 5సెకన్ల తర్వాత స్కిప్‌ చేయొచ్చు. ఇంకొన్ని ప్రకటనలను తప్పనిసరిగా మొత్తం చూడాల్సిందే.