అత్యంత వేగంగా శరీరానికి శక్తిని ఇవ్వడంలో నిజానికి, కార్బోహైడ్రేట్లను మించినవే లేవు. కాకపోతే అంతే వేగంగా ఆ శక్తిని ఖర్చుచేసే శరీర శ్రమ కూడా ఉండాలి. ఆ శ్రమే లేకపోతే కార్బోహైడ్రేట్లు శరీరం బరువును పెంచేస్తాయి. మధుమేహానికి మార్గం వేస్తాయి. అందుకే ఇటీవల చాలామంది కార్బోహైడ్రేట్ ఆహారాన్ని బాగా తగ్గిస్తున్నారు. అయితే తగ్గించిన ఆ ఆహారపు లోటును ప్రొటీన్లతో పూరిస్తున్నారు. అంటే మాంసాహారానికి అధిక ప్రాధాన్యమిస్తున్నారు. అయితే మాంసాహారం అంత తొందరగా జీర్ణం కాదు కాబట్టి, శారీరక శ్రమ ఇక్కడ కూడా అవసరమే! ఆహారంలో మార్పులైతే చేసుకుంటున్నారు కానీ, శరీర శ్రమ మాత్రం చేయడం లేదు. మాంసంలో పీచుపదార్థం ఉండదు కాబట్టి, జీర్ణ సమస్యలు, విసర్జన సమస్యలు ఉండనే ఉంటాయి.ఈ పరిణామాల వల్ల తలెత్తే ఒక ప్రధాన సమస్య శరీరంలోని జీవక్రియలు కుంటుపడడం, ఫలితంగా శరీరం పలురకాలుగా రోగగ్రస్థం కావడమే కాదు. మనిషి ఆయుఃకాలమే తగ్గిపోతుంది. మనిషి బరువు తగ్గడానికీ, షుగర్ నిల్వలు నియంత్రణలో ఉండడానికీ ప్రొటీన్ అవసరం అన్నది వాస్తవమే. కాకపోతే, జంతు సంబంధితమైనది కాకుండా, వృక్ష సంబంధమైన ప్రొటీన్లకు ప్రాధాన్యమివ్వాలి. బాదాం, పిస్తా, జీడిపప్పులతో పాటు, పెసర, అలచంద, మొక్క.జొన్న ధాన్యాలకు ప్రాధాన్యమివ్వాలి. వీటిల్లో సహజంగానే పీచుపదార్థం ఉంటుంది కాబట్టి, జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు లేకపోగా, శరీరం బరువు పెరగకుండానూ, చురుకుదనం తగ్గకుండానూ ఉంటుంది.
ప్రొటీన్‌లో ఏది మేలు?
Related tags :