Fashion

బద్ధకం మానేయి భామ!

Hey lady are you lazy? Read this to boost your motivation!

బద్ధకం… జీవితంలో ఓడిపోవడానికి ప్రధాన కారణం. ఇది వ్యసనంలా మారితే మనిషి ఏ పని చేయడానికీ సిద్ధపడడు. దీన్నుంచి బయటపడాలంటే కొన్ని నియమాలు అనుసరించాలి. వీటిని క్రమం తప్పకుండా పాటిస్తే విజయం మీ సొంతమే.
* బోలెడంత పని కళ్లముందే కనిపిస్తున్నా..కొన్నిసార్లు దాన్ని పూర్తి చేయాలనిపించదు. అలా వదిలేస్తే మరింతగా పేరుకుపోతుంది. మొత్తం ఒకేసారి చేయకపోయినా ఉన్న పనిని విభజించుకొని దశల వారీగా పూర్తి చేసుకుంటూ వెళ్తే సరి. సులువుగా పూర్తవుతుంది. చదువులోనూ ఇదే సూత్రం వర్తిస్తుంది.
* అన్ని పనులు ఒకే సారి ముందు వేసుకోవడం వల్ల ఏ పనీ చేయలేరు. మల్టీటాస్కింగ్‌ వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. ఒత్తిడి పెరిగిపోతుంది. అందుకే కాస్త బద్ధకం వదిలించుకుని ఆ రోజు చేయాల్సిన పనుల జాబితాను ఉదయాన్నే సిద్ధం చేసుకోవాలి. అలాని ఈ జాబితా చాంతాడంతా ఉండక్కర్లేదు. కొన్ని పనులను రాసుకొని ప్రాధాన్య క్రమంలో పూర్తి చేసుకుంటే సరి. రాత్రి పడుకునే ముందు వాటిలో ఎన్నింటినీ సరిగ్గా పూర్తిచేశారో చూసుకుంటే సరి.
* తగినంత శక్తి లేకపోవడం, అలసిపోవడం మూలంగా బద్ధకం వస్తుంది. అందుకే రోజూ కనీసం ఏడుగంటల నిద్ర, పనిలో తగినంత విరామం అవసరం. శరీరానికి సమతులాహారం అందడం, తగినంత వ్యాయామం ఉండటం వల్ల ఈ సమస్య అధిగమించొచ్చు.
* కొన్నిసార్లు మనం చేసే పనికి ఉన్న ప్రాధాన్యాన్ని గుర్తించకపోవడం వల్ల కూడా బద్ధకం ఆవహిస్తుంది. అందుకే మీరు ఏ పనైనా మొదలుపెట్టడానికి ముందే.. దానివల్ల కలిగే ప్రయోజనాలు, సాధించే లక్ష్యాల గురించి తెలుసుకోవాలి.