*దేశీయ స్టాక్‌మార్కెట్లు స్వల్ప నష్టాలతో కొనసాగుతున్నాయి. ఒంటిగంట సమయానికి సెన్సెక్స్ 31, నిఫ్టీ 10 పాయింట్ల నష్టంతో ట్రేడవుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 69.62గా ఉంది.
*హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఔషధ కంపెనీ నాట్కో ఫార్మా గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ఖాతాల ప్రకారం రూ.486.70 కోట్ల మొత్తం ఆదాయాన్ని, రూ.120.40 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.
*బ్యాంకింగేతర ఆర్థిక కంపెనీ(ఎన్‌బీఎఫ్‌సీ)ల కోసం ఆర్‌బీఐ ప్రకటించిన ముసాయిదా ద్రవ్యలభ్యత నిబంధనలు ఆ సంస్థల మార్జిన్లు, ప్రతిఫలాలపై మధ్యకాలంలో ఒత్తిడి తీసుకురావచ్చని విశ్లేషకులు అంటున్నారు.
*ప్రభుత్వ రంగ సంస్థ భెల్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ.682.70 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది.
*గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో గెయిల్ ఇండియా రూ.1,222.23 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది.
*ఇండిగో మాతృ సంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ.589.60 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది.
*ఎగుమతులను ప్రోత్సహించడానికి అపుడే రంగం సిద్ధమైంది. మే 30న గద్దెనెక్కనున్న మోదీ ప్రభుత్వ పరిశీలన కోసం వాణిజ్య మంత్రిత్వ శాఖకు చెందిన పరిశ్రమల, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహకాల విభాగం(డీపీఐఐటీ) 100 రోజుల ప్రణాళికను ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.
*అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్ తన ఎఫ్‌ఎమ్ రేడియో వ్యాపారాన్ని విక్రయించనుంది. ‘బిగ్ ఎఫ్‌ఎమ్’ రేడియోలో వాటాను జాగరణ్ ప్రకాశన్‌కు చెందిన మ్యూజిక్ బ్రాడ్‌క్యాస్ట్(ఎమ్‌బీఎల్)కు రూ.1050 కోట్ల ఎంటర్‌ప్రైజ్ అంచనా విలువకు అమ్మనున్నట్లు అధికార ప్రకటన ఒకటి వెల్లడించింది.
నష్టాలతో స్టాక్‌మార్కెట్లు-వాణిజ్య-05/28
Related tags :