*జనగామ జిల్లాలోని జనగామ మండలం శామీర్‌పేట వద్ద దారుణ సంఘటన చోటు చేసుకుంది. మహిళపై అత్యాచారం చేసిన అనంతరం దుండగులు ఆమెను హత్య చేశారు. మృతదేహాన్ని రోడ్డుపక్కన పడేసి పరారయ్యారు.
*కల్తీ మద్యం తాగి 9 మంది మృతి చెందారు. ఈ విషాద సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకీ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని రామ్‌నగర్‌లో 8 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. మరో ముగ్గురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
* హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం సంభవించింది. భువనగిరి మండలం రాయగిరి వద్ద అదుపుతప్పిన కారు.. బైక్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు.
*శ్రీకాకుళం మండలంలోని దిమ్మిడిజోల గ్రామంలోని ఓ కాలువలో స్నానానికి వెళ్లి తాత, మనవడు మృతి చెందిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది.
*ఝార్ఖండ్‌లో మావోయిస్టులు రెచ్చిపోయారు. సరయ్‌కెల్లాలోని కుచాయ్ ప్రాంతంలో భద్రతాసిబ్బందిని లక్ష్యంగా చేసుకుని ఐఈడీ పేలుడుకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 15 మంది జవాన్లు గాయపడ్డారు.
*ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి జిల్లాలో కల్తీ మద్యం తాగి 11 మంది మృత్యువాత పడ్డారు. ఈఘటనలో మరికొంతమంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బాధితులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరంతా ఒకే దుకాణం నుంచి మద్యం కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
*జపాన్‌లోని కవాసకి నగరంలో ఓ దుండగుడు వీరంగం సృష్టించాడు. కత్తితో అనేక మందిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు చనిపోగా.. మరో 17 మంది తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు.
*ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ సంస్థ ఎండీ అశోక్, ఆయన భార్య శ్రీలక్ష్మి సోమవారం తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
*కారు ఎక్కాలనే సరదా ఆ బాలుడిని మృత్యువు రూపంలో కబళించింది. కన్నతల్లికి కడుపుకోత మిగిల్చింది. ఇటీవలే బాలుడి తండ్రి గుండెపోటుతో మృతి చెందాడు. పుట్టెడు దుఃఖంతో ఆ తల్లి పుట్టింటికి వచ్చింది. అయినా విధి ఆమెపై పగబట్టింది. కన్నకొడుకును పొట్టనబెట్టుకుంది. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం దొమ్మేరులో సోమవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనతో విషాదఛాయలు అలముకొన్నాయి.
*నిబంధనలకు విరుద్ధంగా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించిన కేసులో విశాఖపట్నం శ్రద్ధ ఆసుపత్రి ఎండీ డాక్టర్ ప్రదీప్‌ను పోలీసులు ఆదివారం రాత్రి అరెస్ట్ చేశారు.
*ఇళ్ల నిర్మాణం పేరిట డబ్బు దండుకున్న కేసులో ‘మాళ్యవి కరుణోదయ’ సంస్థ సమన్వయకర్త కొత్త రాజిరెడ్డికి సోమవారం ఆలేరు న్యాయస్థానం రిమాండ్ విధించింది.
*చీర, నవారు కలగలిపి చేసిన ఊయల ఉరితాడుగా మారి ఓ చిన్నారి ఉసురు తీసింది. స్నేహితులతో కలిసి ఆనందంగా ఆడుకుంటున్న చిన్నారి పాలిట అది మృత్యుపాశమైంది. ఈ దారుణం ప్రకాశం జిల్లా అద్దంకి శివారు రాజీవ్ కాలనీలో సోమవారం మధ్యాహ్నం జరిగింది.
* మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలోని లచ్చీరాం తండాకు చెందిన ఓ గిరిజన దంపతులు..తమకు జన్మించిన ఆడ శిశువును విక్రయించారు! మూడో కాన్పులో పుట్టిన ఆ బిడ్డను..ఆసుపత్రి ఖర్చులు చెల్లించేందుకే వారు జనగామ జిల్లా రఘునాథపల్లికి చెందిన జంటకు అప్పగించారు.
*బయో డీజిల్ డీలర్‌షిప్‌లు ఇప్పిస్తామంటూ ఘరానా నేరగాళ్లు ఔత్సాహిక వ్యాపారుల నుంచి రూ.3.5 కోట్లు కొల్లగొట్టారు. జిల్లాలవారీగా ఏజెన్సీలు, పట్టణాల్లో డీజిల్ విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసుకునేందుకు అనుమతులిస్తామని నమ్మబలికి నట్టేట ముంచారు.
*జనశక్తి పార్టీలో కీలకమైన వ్యక్తిని సిద్దిపేట జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన జనశక్తి రాష్ట్ర కార్యదర్శి బొమ్మని నర్సింహ (అలియాస్ నర్సిరెడ్డి/విశ్వనాథం/విశ్వం/ఆనంద్)ను సోమవారం రిమాండుకు తరలించినట్లు అదనపు డీసీపీ నర్సింహారెడ్డి వెల్లడించారు.
* కర్ణాటక రాజధాని బెంగళూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యెలహంకలోని కొగిలు క్రాస్ వద్ద కారు, అంబులెన్స్ ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది.
*హైదరాబాద్‌లోని బేగంపేట సమీపంలో బీరు సీసాలతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
*యాదాద్రి జిల్లా హజీపూర్ ఘటన మరువకముందే మరో దారుణం జరిగింది. దివ్యాంగురాలైన బాలికపై లైంగికదాడి జరిగింది. ఈ సంఘటన యాదాద్రిజిల్లా వలిగొండ మండలంలో ఆదివారం రాత్రి జరిగింది.
రంగారెనాగర్కర్నూలుములుగు జిల్లాలో ఇద్దరుజయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇద్దరుజనగామ జిల్లాలో ముగ్గురుఖమ్మం జిల్లాలో ముగ్గురుభద్రాద్రి జిల్లాలో ఐదుగురుపెద్దపల్లి జిల్లాలో ఐదుగురుకుమరంభీం జిల్లాల్లో ఒకరుసిరిసిల్లకరీంనగర్ జిల్లాలో ముగ్గురునల్లగొండ జిల్లాలో ముగ్గురుయాదాద్రి భువనగిరి జిల్లాలో నలుగురు మంది ప్రాణాలు కోల్పోయారు. సూర్యాపేట జిల్లాలో ముగ్గురుతీవ్ర వడగాల్పులతో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. సోమవారం వడదెబ్బకు గురై పలు జిల్లాల్లో సోమవారం తెలంగాణలో గరిష్ట ఉష్ణోగ్రతలు*డ్డి జిల్లాల్లో ఇద్దరు వడదెబ్బతో అస్వస్థతకు గురై చనిపోయారు.
* ఉత్తర ప్రదేశ్‌లోని బారాబంకి జిల్లాలోని రామ్‌నగర్ ప్రాంతంలో కల్లీ మద్యం సేవించిన ఘటనలో దాదాపు పది మంది మరణించారు. రామ్‌నగర్‌లో కల్తీ మద్యం సేవించి ఎనిమిది మరణించారని, మంగళవారం ఉదయం మరో ముగ్గురిని ఆస్పత్రిలో చేర్పించగా, వారిలో ఓ వ్యక్తి మృత్యువాత పడ్డారని పోలీసులు తెలిపారు.
* బెంగళూరులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఐదురుగు మృతి చెందారు. యలహంక విమానాశ్రయం రోడ్డులో కారు.. అంబులెన్స్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఐదుగురు వ్యక్తులు మృతి చెందారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. మృతులంతా పశ్చిమ బెంగాల్ రాష్ట్ర వాసులుగా పోలీసులు గుర్తించారు. మిగితా వివరాలు తెలియాల్సి ఉంది.
* రోడ్డుపై ఇద్దరు బైక్‌పై వెళుతున్నారు. ఎదురుగా పేట్రోలింగ్ పోలీసులు కనపడ్డారు. వెంటనే చేతిలో ఉన్న బ్యాగును విసిరేసి.. వచ్చిన దారిలోనే వెనక్కి వెళ్లిపోయారు. అక్కడకు పరిగెత్తుకెళ్లిన పోలీసులు.. హడావుడిగా బ్యాగు తెరిచి చూశారు. లోపల కట్టలు కట్టలుగా ఐదు వందల రూపాయల నోట్లు కనపడ్డాయి. దీంతో ఒక్కసారిగా షాకైన పోలీసులు.. వాటిని లెక్కపెట్టగా.. మొత్తం కోటీ యాభై లక్షల రూపాయలుగా తేలింది.
* కృష్ణాజిల్లా నందిగామ..బ్యాంక్ ఉద్యోగి చేతి వాటంకంచికచెర్ల మండలం పరిటాల గ్రామంలోని SBI బ్యాంక్ ఉద్యోగి చేతి వాటం.రైతులు తమ వద్ద వున్న బంగారం పోలం పనుల నిమిత్తం పరిటాల గ్రామంలోని SBI బ్యాంక్ లో గోల్డ్ లోన్ పెట్టగా బ్యాంక్ ఉద్యోగి లోన్ రెట్టింపు చేసి తన చేతి వాటం చూపించిన వైనం.రైతులు లక్ష రూపాయలు విలువ చేసే బంగారం పెట్టి లక్ష రూపాయలు తీసుకొనగా దానికి ఉద్యోగి రెట్టింపు రుణం తీసుకున్నట్లు రెట్టింపు చేసిన క్యాషియర్ శ్రీనివాసరావు మిగిలిన సొమ్మును స్వాహా.
* అఫ్గానిస్థాన్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆ దేశ రాజధాని కాబూల్‌లో సోమవారం తెల్లవారు జామున ఓ ఇంట్లోకి ప్రవేశించిన దుండగుడు ఆ కుటుంబంలోని ఏడుగురిపై కాల్పులు జరిపి, వారి ప్రాణాలను తీశాడు.
* గుంటూరు జీజీహెచ్ ఆసుపత్రిలో ఓ కన్న తల్లి కర్కశత్వంగా ప్రవర్తించింది. ఆసుపత్రిలో ఓ బిడ్డను ప్రసవించి ఆసుపత్రిలోనే వదిలేసి వెళ్ళిపోయింది. ప్రణాళికతో తప్పుడు చిరునామాతో ఆసుపత్రిలో చేరిన మహిళ పసికందును అక్కడే వదిలేసి వెళ్ళిపోయింది. జీజీహెచ్ వైద్యులు పసికందును సంరక్షిస్తుండగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
* గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం ఎండుగులపాలెంలో వ్యక్తి హత్య కలకలం రేపుతోందిక్షుద్ర పూజల నేపథ్యంలో హత్య జరిగి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతుండటంతో మరింత సంచలనంగా మారిందిఎండుగులపాలెం సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి హత్య జరిగిందిగొంతు కోసి వ్యక్తి అత్యంత దారుణంగా దుండగులు హతమార్చారుమృతదేహాం పక్కనే క్షుద్రపూజల ఆనవాళ్లుండటంతో సంచలనంగా మారింది.
* పోలీసులకు పట్టుబడకుండా తప్పించుకునేందుకు దుండగులు నోట్ల కట్టలను రోడ్డుపై విసిరేసిన అనూహ్య ఘటన తమిళనాడులో జరిగింది. చెన్నై మహానగరానికి పొరుగున ఉన్న కోట్టూరుపురంలో ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు వాహన సోదాలు చేస్తుండగా భయంతో డబ్బు కట్టలను రోడ్డుపై విసిరి దుండగులు పరిపోయారు.
* కర్ణాటక రాజధాని బెంగళూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యెలహంకలోని కొగిలు క్రాస్ వద్ద కారు, అంబులెన్స్ ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది.
* హైదరాబాద్‌లోని బేగంపేట సమీపంలో బీరు సీసాలతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రోడ్డుపై పడిపోయిన బీరుసీసాలు చోరీకి గురికాకుండా పోలీసులు కాపలా కాస్తున్నారు.
* కర్ణాటకలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. యలహంక నగరంలో కారు-అంబులెన్స్ ఢీకొని ఈ విషాదం చోటుచేసుకుంది. ప్రమాదం ధాటికి వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. ఈ ఘటనలో గాయపడ్డ బాలుడిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.
*సార్వత్రిక ఎన్నికల అనంతరం ఉత్తరప్రదేశ్ లో రాజకీయ హత్య చోటుచేసుకుంది. కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ గెలుపొందిన అమెటీ లోక్ సభ నియోజకవర్గంలో ఆమెకు సన్నిహిత మద్దతుదారుడిని దుండగులు కాల్చి చంపేశారు.
*చైనా రవాణా నౌకలో లీకవడంతో పది మంది మృతి చెందగా, మరో పందొమ్మిది గాయపడ్డారు. వీహై సిటిలోని లాంగ్ యాన్ నౌకాశ్రయంలో పుజియన్ షిప్పింగ్ కంపెనీకి చెందిన నౌకకు మరమత్తు చేస్తుండగా, ఈ ప్రమాదం జరిగింది.
*నేపాల్ రాజధాని కాట్ మండూ బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. ఆదివారం ఉదయం వేర్వేరు ప్రాంతాల్లో సంభవించిన మూడు పేలుళ్ళలో నలుగురు మరణించగా, ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.
* బ్రెజిల్‌లోని అమెజొనాస్ రాష్ట్రంలో గల ఓ జైల్లో ఖైదీల మధ్య ఘర్షణ జరిగి 15 మంది మృతిచెందారు. స్థానిక కాలమానం ప్రకారం.. ఆదివారం ఉదయం 11 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది.
*స్కిమ్మర్ యంత్రాన్ని ఉపయోగించి ఏటీఎం కార్డులను క్లోనింగ్ చేసి ఏటీఎం యంత్రాలనుంచి నగదు డ్రా చేస్తున్న హరియాణా గ్యాంగ్‌కు చెందిన వీరేంద్రసింగ్‌ను సైబర్‌క్రైం పోలీసులు అరెస్టు చేశారు.
*ఇసుక లారీలో గుట్టుగా తరలిస్తున్న గంజాయిని విజయవాడలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు పట్టుకున్నారు. రూ.2.27 కోట్ల విలువైన 1137 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. నర్సీపట్నం ఏజెన్సీలోని సపర్ల గ్రామం నుంచి హైదరాబాద్‌కు గంజాయి భారీగా రవాణా అవుతున్నట్లు స్పష్టమైన సమాచారం రావడంతో విజయవాడ నగర శివారులో శుక్రవారం పట్టుకున్నట్లు తెలిపారు.
*ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లా హిరోలీ అటవీ ప్రాంతంలో ఆదివారం జరిగిన ఎదురు కాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందాడు. *అనురాగం స్థానాన్ని ఉన్మాదం ఆక్రమించి శనివారం సిద్దిపేటలో ఓ కన్న తల్లి పేగు బంధానికి తీపి గురుతులైన ఇద్దరు చిన్నారులను పగిలిన సీసాతో పొడిచి దారుణంగా అంతమొందించగా.. ఆదివారం మూసాపేటలో ఓ తండ్రి నాలుగేళ్ల తన కుమారుడిని నీటి బకెట్‌లో తలకిందులుగా ముంచి ప్రాణం తీశాడు.
*గుంటూరు జిల్లా సత్తెనపల్లి యశప్పాలెం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. వీరిని బేచవరం ఎంపీటీసీ సభ్యుడు కొండా వెంకటేశ్వరరెడ్డి (45), గుండ్లపల్లికి చెందిన మెకానికల్ ఇంజినీర్ శ్రీనివాస్ రెడ్డి (45)గా గుర్తించారు.
*విజయవాడ వన్‌టౌన్ పరిధిలోని పాతబస్తీ పంజా సెంటర్‌లో ఆదివారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తి హల్‌చల్ చేశాడు. చేతిలో కర్ర, పగిలిపోయిన బీరుసీసా పట్టుకొని స్థానికులపై దాడిచేస్తూ భయభ్రాంతులకు గురిచేశాడు.
*కోల్ కత్తా మాజీ పోలీసు కమీషనరు రాజీవ్ కుమార్ ను సీబీఐ ఈసారి అంత తేలిగ్గా వదిలి పెట్టేలా కనిపించడం లేదు. సోమవారం ఉదయం పది గంటలకల్ల్లా సాల్ట్ లేక్ లోని సీబీఐ కార్యాలయానికి రావాల్సిందిగా ఆదివారం సమన్లు జారీ చేసింది. ఇవి స్వయంగా అందజేయడానికి నలుగురు సీబీఐ అధికారుల ఆదివారం సాయంత్రం ఆయన కోసం మూడుచోట్లకు వెళ్లారు.
* బ్రెజిల్‌లోని అమెజొనాస్ రాష్ట్రంలో గల ఓ జైల్లో ఖైదీల మధ్య ఘర్షణ జరిగి 15 మంది మృతిచెందారు. స్థానిక కాలమానం ప్రకారం.. ఆదివారం ఉదయం 11 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది.
* నడిరోడ్డుపై పెట్రోల్ ట్యాంకర్‌లో మంటలు చెలరేగడంతో ముంబైలోని గోరెగావ్ ఫ్లైఓవర్‌పై ట్రాఫిక్ నిలిచిపోయింది. డ్రైవర్ క్యాబిన్‌లో చెలరేగిన మంటలు క్రమంగా ట్యాంకర్ అంతటికీ వ్యాపించడంతో అంధేరి నుంచి గోరెగావ్ వెళ్లే రోడ్లపై ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. సోమవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకోవడంతో ముంబై పోలీసులు అప్రమత్తమయ్యారు.
కల్తీ మద్యానికి తొమ్మిది మంది బలి-నేరవార్తలు–05/28
Related tags :