ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ప్రముఖ డ్రమ్మర్ మెహర్ చంటి ఆధ్వర్యంలో డల్లాస్‌లో ఏర్పాటు చేసిన MLIVE స్టూడియోపై ప్రముఖ సినీ సంగీత దర్శకులు ఎం.ఎం.కీరవాణి ప్రశంసల జల్లు కురిపించారు. రిహార్సల్స్ చేసుకోవడానికి, సరికొత్త రాగాలను రూపొందించడానికి అమెరికాలో ఆహ్లాదభరితమైన, అత్యాధునిక సాంకేతికతతో ప్రశాంతమైన వాతావరణంలో ఏర్పాటు చేసిన ఈ స్టూడియో తనకు చాలా బాగా నచ్చిందని, ఇందులోని సౌకర్యాలు, సౌలభ్యాలు చూసి తనకు అసూయ కలుగుతోందని కీరవాణి పేర్కొన్నారు. చంటి ఈ స్టూడియో ద్వారా మరింత ఎత్తుకు ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. నాట్స్ సంబరాల్లో ప్రదర్శనలిచ్చేందుకు అమెరికాలో పర్యటిస్తున్న కీరవాణితో పాటు సినీ సంగీత దర్శక గాయకులు ఆర్పీ పట్నాయిక్, మనో తదితరులు కూడా ఈ స్టూడియోను సందర్శించి చంటికి తమ అభినందనలు తెలిపారు.
MLIVE స్టూడియోకు కీరవాణి ప్రశంసలు
Related tags :