తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అధికారులు గైర్హాజరవడంతో ఇవాళ జరగాల్సిన పాలకమండలి సమావేశం రద్దయింది. ఈసందర్భంగా తితిదే ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ…శ్రీవారి సన్నిధిలో స్వచ్ఛందంగా రాజీనామా చేయలేనని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని తేల్చి చెప్పారు. ఇవాళ నిర్వహించతలపెట్టిన పాలకమండలి సమావేశానికి అధికారులు రాకపోవడంతో విరమించుకుంటున్నట్లు తెలిపారు. పాలకమండలి భేటీ నిర్వహించాలని నెలముందే నిర్ణయించామని చెప్పారు. ప్రభుత్వం నిర్ణయంపైనే పాలకమండలి భవితవ్యం ఆధారపడి ఉందని సుధాకర్‌యాదవ్ అన్నారు. పుట్టా నిర్ణయంతో సంబంధం లేకుండా తితిదే పాలకమండలి సభ్యత్వానికి చల్లా రామచంద్రారెడ్డి, పొట్లూరి రమేశ్‌బాబు రాజీనామా చేశారు.
నేను రాజీనామా చేయను
Related tags :