మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో డ్రామానే ఎక్కువగా ఉందని అభిప్రాయపడ్డారు సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్. ఆమె కథానాయికగా నటించిన ‘ఎన్జీకే’ చిత్రం రాజకీయ నేపథ్యంలో తెరకెక్కించారు. ఈ సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా రకుల్..ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎన్నికలు, రాజకీయాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు.
‘నా చుట్టూ సమాజంలో ఏం జరుగుతోందో నాకు తెలుసు. కానీ మొన్న జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మాత్రం డ్రామా ఎక్కువగా ఉన్నందుకు చాలా బాధగా ఉంది. కొందరు రాజకీయ నేతలు సీట్ల కోసం కొట్టుకుంటుంటే ఓ ధారావాహికకు వచ్చే టీఆర్పీ రేటింగ్స్ కోసం కొట్టుకుంటున్నట్లు అనిపించింది. మన దేశంలో విభజన పాలన ఉండకూడదు. దేశం మొత్తం ఐకమత్యంగా ఉండాలి. ప్రతి రాష్ట్రానికి దక్కాల్సినవన్నీ దక్కాలి’ అన్నారు.
మన ఎన్నికల్లో డ్రామాకి…
Related tags :