అమెరికాలో మే నెలను మానసిక ఆరోగ్య అవగాహన మాసంగా 1949 నుండి పాటిస్తున్నారు. ఈ సందర్భంగా డాలస్ తెలంగాణ ప్రజా సమితి (టీపాడ్) మే నెల 19వ తేదీన, యాంగ్జైటీ, డిప్రెషన్ మేనేజ్మెంట్ అవేర్నెస్ పై డాలస్ నగరం, ప్లానోలోని ,ఎస్. పి. ఆర్. బ్యాంకెట్ హాల్ లో ఆరోగ్య అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో దాదాపుగా వంద మంది సభ్యులు పాల్గొన్నారు. మానసిక ఒత్తిడి అనేది దాదాపుగా మన జీవనశైలిలో ముఖ్యమైన భాగం అయిపోయింది. ఇది యువతను మరీ ఎక్కువగా పీడిస్తోంది. సాధారణంగా టీనేజిలో ఉన్న పిల్లలు ,ఇటు తల్లిదండ్రులు, అటు స్నేహితులు మరోవైపు సమాజ సభ్యులు, ‘ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి’ అని ఇచ్చే సూచనలతో తికమక పడుతూ ఉంటారు. వారికి సరైన మార్గదర్శనం దొరకక ఎన్నో రకాల మానసిక ఒత్తిళ్లకు, తద్వారా వచ్చే మానసిక వ్యాధులకు గురవుతుంటారు. టీపాడ్ డాలస్ ప్రాంతానికి చెందిన ప్రఖ్యాతి పొందిన, మానసిక నిపుణులు డాక్టర్ పవన్ పామదుర్తి సహాయంతో “యాంగ్జైటీ, డిప్రెషన్ మేనేజ్మెంట్’ ఆరోగ్య అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో ఒత్తిడి, ఆందోళనకు సంబంధించిన పలు అంశాలను చర్చించి, వాటిని గుర్తించి ఎలా ఎదుర్కోవాలి విషయాలపై సుదీర్ఘమైన వివరణ ఇవ్వడం జరిగింది. “యాంగ్జైటీ, డిప్రెషన్ మేనేజ్మెంట్’ ఆరోగ్య అవగాహన సదస్సు కార్యక్రమ నిర్వహణ చంద్రారెడ్డి పోలీస్ టీపాడ్ ప్రెసిడెంట్, శ్రీనివాస్ వేముల, రత్న ఉప్పాల కార్యక్రమ సమన్వయకర్తలుగా, టీపాడ్ ఫౌండేషన్ కమిటీ జానకి రామ్ మందాడి, రాజ వర్ధన్ గొంది, అజయ్ రెడ్డి, రావు కలవల, మహేందర్ కామిరెడ్డి, రఘు వీర్ బండారు, ఉపేందర్ తెలుగు, రామ్ అన్నాడి, అశోక్ కొండల, బోర్డు అఫ్ ట్రస్టీస్ పవన్ గంగాధర, మాధవి సుంకిరెడ్డి, సుధాకర్ కలసాని, ఇంద్రాణి పంచార్పుల, బుచ్చి రెడ్డి గోలి, శారద సింగిరెడ్డి, ఆఫీస్ బేరర్స్ కమిటీ రవికాంత్ రెడ్డి మామిడి వైస్ ప్రెసిడెంట్, మాధవి లోకిరెడ్డి జనరల్ సెక్రటరీ, లక్ష్మి పోరెడ్డి జాయింట్ సెక్రటరీ, అనురాధ మేకల ట్రెసరర్, శంకర్ పరిమళ్ జాయింట్ ట్రెసరర్, ఎగ్జిక్యూటివ్ కమిటీ శ్రీనివాస్ వేముల, రత్నఉప్పాల, రూపకన్నయ్య గిరి, మధుమతి వ్యాసరాజు, దీప్తి సూర్యదేవర, శరత్ ఎర్రం, రోజా అడెపు, లింగారెడ్డి, అడ్వైజరి కమిటీ సభ్యులు వేణు భాగ్యనగర్, విక్రమ్ జంగం, నరేష్ సుంకిరెడ్డి , కరణ్ పోరెడ్డి , జయ తెలకలపల్లి, సురేందర్ చింతల,అరవింద్ ముప్పిడి, గంగ దేవర, సతీష్ నాగిళ్ల, కళ్యాణి తాడిమెట్టి, కొలాబరేషన్ కమిటీ, వంశీకృష్ణ, స్వప్న తుమ్మపాల, శ్రీనివాస్ తుల, విజయ్ రెడ్డి, అపర్ణ కొల్లూరి,అనూష వనం, శశి రెడ్డి కర్రి, మంజుల తొడుపునూరి , మాధవి ఓంకార్, గాయత్రి గిరి , జయశ్రీ మురుకుట్ల, రవీంద్ర ధూళిపాళ, శ్రీనివాస్ కూటికంటి,శరత్ పున్ రెడ్డి,శ్రీధర్ కంచర్ల, శ్రీనివాస్ అన్నమనేని, స్రవణ్ నిడిగంటి, నితిన్ చంద్ర, అపర్ణ సింగిరెడ్డి, కవిత బ్రహ్మదేవర,నితిన్ కొర్వి , సుగాత్రి గుడూరు, మాధవి మెంట ,వందన గోరు, లావణ్య యరకాల, శ్రీకాంత్ రౌతు, తిలక్ వన్నంపుల, రేణుక చనుమోలు ఆధ్వర్యములో నిర్వహించారు. గంటన్నర సేపు జరిగిన ఈ సమావేశంలో దాదాపు అన్ని వయసుల వారిని ఉద్దేశించి డాక్టర్ పవన్ ప్రసంగించారు. హాజరైన సభ్యులు ఎంతో ఉత్సాహంగా ప్రశ్నలను అడుగుతూ, తమ అనునాలను తీర్చుకుంటూ, సదస్సులో పాల్గొన్నారు. ఇంత మంచి అంశాన్ని తమకు అందించిన, టీపాడ్ యాజమాన్యం వారికి శ్రోతలందరూ ధన్యవాదాలు తెలిపారు. తమకు యాంగ్జైటీ, డిప్రెషన్ మేనేజ్మెంట్ అవేర్నెస్ పై ఎంతో విషయ జ్ఞానాన్ని అందించిన డాక్టర్ పవన్ పాముదుర్తి గారిని తమ కరతాళధ్వనులతో అభినందించారు. ఇందులో పాల్గొన్న యువత మరియు ఇతర సభ్యులు, ఈ సదస్సు తమకెంతో సంతృప్తినిచ్చిందని ఆనందం వెలిబుచ్చారు. టీపాడ్ యాజమాన్యం డాక్టర్ పవన్ పామదుర్తికి పుష్ప గుచ్ఛము మరియు దుశ్శాలువతో సన్మానించి ఘనంగా సత్కరించారు. తదనంతరం పత్రిక మరియు ప్రసార మాధ్యమాలకు, సదస్సు నిర్వహించటానికి కావాల్సిన ప్రాంగణ వసతులు కల్పించిన ఎస్.పి.ఆర్ బాంక్వెట్ హాల్ యాజమాన్యం శీలం రెడ్డి మరియు కృష్ణవేణి శీలంకి మరియు దావత్ కుసైన్ రెస్టారెంటు యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు.
TPAD ఆధ్వర్యంలో ఒత్తిడి కుంగుబాటులపై అవగాహన సదస్సు
Related tags :