NRI-NRT

సిడ్నీలో వైకాపా సంబరాలు

YSRCP Australlia Celebrates 2019 Election Win-TNILIVE Australlia News

వైయస్సార్ సిపి సిడ్నీ ప్రవాసాంద్రుల విజయోత్సవాలు …

సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం సృష్టిస్తూ 151 స్థానాలు మరియు పార్లమెంట్ సీట్లు 22 గెలిచిన శుభసందర్భంలో ఆ పార్టీ శ్రేయాభిలాషులు ఆస్ట్రేలియా లోని సిడ్నీ నగరం లో సంబరాలు చేసుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం 12:00 నుంచి సాయంత్రం 4:30 వరకు జరిగిన వేడుకల్లో వైఎస్‌ జగన్‌ అభిమానుల కెరెంతలతో పర్రమెట్ట పార్క్ దద్దరిల్లినది.

వైఎస్సార్‌సీపీ సిడ్నీ విభాగం గౌరవాధ్యక్షులు శ్రీరంగారెడ్డి , ఆధ్వర్యంలో సభ్యులు గోవిందరెడ్డి , ప్రకాష్ రెడ్డి , తిమ్మారెడ్డి , శిరీష్ , దామోదర్ , రాకేష్ రెడ్డి, శ్రీకాంత్ మరియు సభ్యులు విజయ్ దంటూ, శ్యామ్ (బీఎంపీ టెక్నాలజీస్), రాజశేఖర్, జైపాల్ రెడ్డి, డేవిడ్, సుమేశ్, వాసు, వెంకట్ రెడ్డి , ఇంద్ర, సతీష్, తరుణ్, రమణ , శివా రెడ్డి, రామకృష్ణ రెడ్డి, అరవింద రెడ్డి , వేణు, కమల్, వీరేంద్రనాథ్ మరియు మహిళా సభ్యులు భారతి రెడ్డి, మను రెడ్డి , సుజాత, అరవిందా రెడ్డి, లతా, స్రవంతి మరియు పెద్ద సంఖ్యలో కార్యకత్తలు అభిమానులు పాల్గొన్నారు

ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ సిడ్నీ విభాగం నేతలు కాబోయే ముఖమంత్రి Y S జగన్ గారికి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరంగారెడ్డి మాట్లాడుతూ జగన్ గారు మంచి పరిపాలన అందించాలని ఆవిధముగా మంచిపేరు తెచ్చుకోవాలని ఆకాంక్షిచారు. ప్రకాష్ గారు మాట్లాడుతూ జగన్ మంచి పరిపాలన అందించి 25 సంవత్సరాలు పాటు ముఖమంత్రి గా ఉండాలని తిమ్మ రెడ్డి గారు మాట్లాడుతూ అన్ని రకాల ప్రజలు జగన్ ని ఆదరించారని, గోవింద రెడ్డి గారు మాట్లాడుతూ ప్రజలు సమస్యలు మీద పోరాటాలు చేసి ప్రజల మెప్పు వలన ఈ విజయం సాధించాడు అని చెప్పారు. పలువురు తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్ నాయకులు మాట్లాడుతూ వైస్సార్ పరిపాలన గురించి గుర్తు చేసుకొని అలాగే జగన్ మోహన్ రెడ్డి పరిపాలనిచాలని చెప్పారు.

ఈ సందర్భంగా వైయస్సార్ మరియు జగన్ అభిమానుల కేక్‌ కట్‌ చేసి తర్వాత జగన్ నినాదాలు చేస్తూ వారి ఆనందాన్ని పంచు కొన్నారు.