‘‘సవాళ్లను స్వీకరించడం నా జాబ్ హక్కు. అందుకు ఎందాకైనా వెళ్తాను’’ అంటున్నారు కాజల్ అగర్వాల్. అనడమే కాదు ఆ చాలెంజ్‌కు గడువు కూడా ఫిక్స్ చేసేశారు. విషయమేంటంటే వంద రోజుల్లో ఫిట్‌గా మారిపోవాలని కాజల్ నిశ్చయించుకున్నారు. అందుకే ఈ చాలెంజ్ కూడా టేకప్ చేశారు. ఈ చాలెంజ్ గురించి కాజల్ మాట్లాడుతూ – ‘‘యాక్టర్సే కాదు అందరూ ఫిట్‌గా ఉండాలి. నా శరీరాన్ని నేను అద్భుతంగా తయారు చేసుకోవాలనుకుంటున్నాను. అందులో భాగంగా ఈ చాలెంజ్ తీసుకుంటున్నాను. నా కోచ్ శ్రీరామ్ పర్యవేక్షణలో దీన్ని మొదలుపెడుతున్నాను. ఏం తినాలి? ఏ ఎక్సర్‌సైజ్‌లు చేయాలి? అనేవి చాలా శ్రమతో కూడుకున్న పనులు. వాటిని కూడా చాలా తేలిక చేస్తున్నారు ఆయన. ఈ చాలెంజ్‌లో అసహజత్వానికి చోటే లేదు. కేవలం న్యాచురల్‌గా లభించే న్యూట్రిషన్స్‌తోనే ఈ చాలెంజ్‌లో పాల్గొంటున్నాను. ఎలాంటి మార్పు కనిపిస్తుందో వంద రోజుల్లో చూద్దాం’’ అని పేర్కొన్నారు.
100రోజుల సవాల్
Related tags :