*హైదరాబాద్‌కు చెందిన అగ్రశ్రేణి ఔషధ సంస్థ అయిన అరబిందో ఫార్మా గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ఖాతాల ప్రకారం రూ.5,292.2 కోట్ల ఆదాయాన్ని, రూ.585.4 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది.
*హిందుస్థాన్ షిప్‌యార్డులో నిర్మించే ఫ్లీట్ సపోర్టు వెసల్స్ (ఎఫ్‌ఎస్‌ఎస్) నిర్మాణానికి ఇస్తాంబుల్ సహాయ సహకారాలు అందించనుంది.
*ప్రభుత్వ రంగ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) మెరుగైన ఫలితాలు ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో నికర నష్టాన్ని రూ.4,750 కోట్లకు తగ్గించుకుంది.
*కోళ్లలో పలు వ్యాధులను నిరోధించేందుకు అవసరమైన వ్యాక్సిన్లను దేశీయ మార్కెట్లోకి యూరప్‌కు చెందిన హిప్రా విడుదల చేసింది.
*ఉద్యోగ శిక్షణ (అప్రెంటీస్)లో ఉన్న వారికి చెల్లిస్తున్న ఉపకార వేతనాలు హైదరాబాద్‌లోనే అధికంగా ఉన్నట్లు టీమ్‌లీజ్ స్కిల్స్ యూనివర్సిటీ నివేదిక వెల్లడించింది.
*ఆన్‌లైన్‌లో ఆరోగ్య సేవలను అందించే జోయ్‌లో డిజిహెల్త్ కార్పొరేట్ ఉద్యోగుల కోసం ఆరోగ్య కార్డును ప్రవేశ పెట్టింది.
* పురుషుల దుస్తుల దేశీయ బ్రాండ్ ఇండియన్ టెరైన్ ప్రచారకర్తగా ప్రఖ్యాత క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని నియమితులయ్యారు.
*వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) రేట్లలో 12, 18 శాతాలను విలీనం చేయాలన్న డిమాండ్ ఇప్పట్లో నెరవేరేలా కనిపించడం లేదు.
*గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో సన్ ఫార్మా రూ.635.88 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది.
* అంకుర సంస్థలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించి, వాటి వృద్ధికి తోడ్పడే టి-హబ్ ల్యాబ్ 32 కార్యక్రమం రెండో విడతలో 45 సంస్థలకు చోటు లభించింది.
* భారతీ ఎయిర్‌టెల్‌కు చెందిన ఆఫ్రికా వ్యాపార విభాగం మెగా పబ్లిక్ ఇష్యూకు ప్రణాళికలు రచిస్తోంది. ప్రతిపాదిత ఇష్యూ ద్వారా దాదాపు రూ.6,970 కోట్లు (1 బిలియన్ డాలర్లు) సమీకరించే అవకాశం ఉంది.
అరబిందోకు అమెరికా అండ-వాణిజ్య-05/29
Related tags :