DailyDose

బయోడీజిల్ పేరిట ₹20కోట్లు నొక్కేశారు-నేరవార్తలు-05/29

May 29 2019 - Daily Crime News - Group Scams 20Crore INR Under BioDiesel Scam

*శంషాబాద్ విమానాశ్రయం కేంద్రంగా బంగారం అక్రమ రవాణా కొనసాగుతూనే ఉంది. దుబాయి నుంచి వచ్చిన ఓ ప్రయనీకురాలి నుంచి పదకొండు కిలోక బంగారం నాలుగు లక్షల విదేశీ కరెన్సీని స్వాదేనం చేసుకున్నారు. డీఆర్ఐ అధికారులు. నిన్దితురాలి పై కేసు నమోదు చేశారు. పెద్ద మొత్తంలో బంగారంతో పాటు విదేశీ కరెన్సీ సైతం పట్టుబడిన నేపద్యంలో ఈ స్మగ్లింగ్ వెనుక ఇంకా ఎవరెవరికి సంబందాలు ఉన్నాయి అనే కోణంలో కూఫీ లాగుతున్నారు డీఆర్ఐ అధికారులు.
*క్రిమిన ల్ దిఫమేషణ్ కేసు విచారణలో భాగంగా జులై 12న స్వయంగా హాజరుకావాలంటూ కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీకి అహ్మదాబాద్ కోర్టు నోటీసులు జరీ చేసింది. అహ్మదాబాద్ డిస్త్రిక్ ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో భాగంగా కోర్టు ఈ ఆదేశాలు జరీ చేసింది.
*నిజామాబాద్ జిల్లాలోని ముప్కాల్ శివారు వరద కాలువ వద్ద అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. గ్యాస్ సిలిండర్ పేలి కూలీలకు చెందిన 10 పూరిగుడిసెలు దగ్ధమయ్యాయి.
*పెద్దపల్లి జిల్లాలోని రామగుండం పరిధిలో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండటాన్ని పోలీసులు గుర్తించి పట్టుకున్నారు. సుమారు రూ. 11 లక్షల విలువైన 500 క్వింటాళ్ల బియ్యంను పట్టుకున్నారు.
*ఓ మహిళ ఫిర్యాదుతో ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పై క్రిమినల్ కేసు నమోదైంది. హైదరాబాద్ లోని బీహెచ్ఈఎల్ కు చెందిన ఓ మహిళా పారిశ్రామిక వేత్త ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. తనను అమెరికా పంపిస్తానని చెప్పి డబ్బులు తీసుకుని మోసం చేశారని తన ఫిర్యాదులో ఆమె ఆరోపించారు.
*మద్యం సేవిస్తు వాహనాలను నడుపుతున్న 28 మంది పై కేసు నమోదు చేసిన ఫోర్త్ టౌన్ ట్రాఫీక్ పోలీసులు.
పట్టుబడిన వారిని కోర్టులో గజరుపరిచిన పోలిసులు28 మందికి 62,500 జరిమాన విధించిన కోర్టు.ఒక వ్యక్తి ఏడురోజులు, ఇద్దరికి మూడు రోజులు, ఇద్దరికి రెండు రోజులు , ఒక వ్యక్తి రెండు రోజులు జైల్ శిక్ష విధించిన 8వ అడిషనల్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు.
* ట్రాక్టర్‌- ద్విచక్ర వాహనం ఎదురెదురుగా ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు, ఒకరికి స్వల్ప గాయాలైన సంఘటన మండలంలోని రాజంపల్లి గ్రామ సమీపంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది.
*అంబాజీపేటలోని మార్కెట్‌ యార్డు పక్కన గల ఫాతిమా కొబ్బరి పీచు పరిశ్రమలో బుధవారం ఉదయం భారీ అగ్ని పప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న అమలాపురం అగ్నిమాక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపుచేస్తున్నారు.
*క్రూడ్‌ ఆయిల్‌ రవాణా చేసే లారీ ఖాళీ ట్యాంకరు పేలి దానికి వెల్డింగ్‌ చేస్తున్న వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. ఈ దారుణ ఘటన మంగళవారం విశాఖపట్నంలో చోటు చేసుకుంది.
*బయో డీజిల్‌ బంకులు ఇస్తామంటూ ప్రకటనలిచ్చి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సహా పలు రాష్ట్రాల్లో ఔత్సాహికుల నుంచి రూ.20 కోట్లు దండుకున్న ఇద్దరు నిందితులను హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు.
* జమ్మూకశ్మీర్‌లోని అనంతనాగ్‌ జిల్లా కచ్వాన్‌ అటవీ ప్రాంతంలో మంగళవారం ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో భద్రతాదళాలు ఇద్దరు ముష్కరులను మట్టుబెట్టాయి. హతులు ఏ సంస్థకు చెందినవారో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు
*ఉత్తర్‌ప్రదేశ్‌లోని బారాబంకి జిల్లాలో కల్తీ మద్యం తాగి 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 40 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
*గొలుసుకట్టు పథకం ముసుగులో మదుపరులను మోసం చేసిన హీరాగోల్డ్‌ సంస్థపై హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌లో కొత్త కేసు నమోదైంది.
*ఝార్ఖండ్‌లో మావోయిస్టులు రెచ్చిపోయారు. సరాయ్‌కేలా-ఖర్‌సావాన్‌ జిల్లాలోని హుర్దా అడవుల్లో భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకొని మంగళవారం తెల్లవారుజామున పేలుళ్లకు తెగబడ్డారు.
*వీసా ఇప్పిస్తానని నమ్మించి మోసగించారంటూ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌, ఇద్దరు అనుచరులపై పంజాగుట్ట పోలీసులు మోసం కేసు నమోదు చేశారు.
*నెదర్లాండ్స్‌ కేంద్రంగా నడిచే తమ సంస్థకు నెల్లూరులో అనుబంధ కార్యాలయం ఉందంటూ ఓ సైబర్‌ నేరగాడు అంతర్జాలంలో ప్రకటన ఇచ్చాడు.
*ఏపీలోని అనంతపురం జిల్లా కణేకల్లు మండలంలోని యర్రగుంట సమీపంలో కళ్యాణదుర్గం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సుకు మంగళవారం కొద్దిలో పెను ప్రమాదం తప్పింది
*దుబాయి నుంచి వచ్చిన ఓ ప్రయాణికురాలి వద్ద శంషాబాద్‌ విమానాశ్రయంలో డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) అధికారులు 11.1 కిలోల బంగారం, విదేశీ కరెన్సీని పట్టుకున్నారు.
*ట్రాక్టర్‌ ఢీకొని బాలుడు దుర్మరణం చెందిన విషాదకర ఘటన మంగళవారం కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం కాచాపూర్‌లో చోటుచేసుకుంది.
*నెల్లూరు జిల్లా నాయుడుపేట రైల్వే స్టేషన్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. తిరుచ్చి ఎక్స్‌ప్రెస్‌ రైల్లో ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు రైలు నుంచి జారిపడి మృతి చెందారు.
*భార్యాభర్తల మధ్య జరిగిన ఘర్షణ ఓ వ్యక్తి మృతికి కారణమైంది. ఈ ఘటన జనగామ జిల్లా కడగుట్టతండాలో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగింది.
*తిరుమల ఘాట్‌ రోడ్డులో ప్రమాదం తప్పింది. రెండో కనుమ రహదారిలో వేగంగా వెళ్లిన ఆర్టీసీ బస్సు కొండ చరియలను ఢీకొట్టింది. తిరుపతి నుంచి తిరుమల కొండపైకి వెళ్తుండగా బస్సు డివైడర్‌ను ఢీకొట్టి పక్కకు ఒరిగిపోయింది. ఈ ప్రమాదంలో భక్తులకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది.
*టైర్ పగలడంతో ఓ లారీ బోల్తా పడి మంటలు చెలరేగడంతో లారీ దగ్ధమైంది. చౌటుప్పల్ శివారులో ఈ ఘటన చోటు చేసుకుంది. లారీ టైర్‌ పగలడంతో ఐరన్ రా మెటీరియల్ లోడ్‌‌తో వెళుతున్న లారీ ఒక్కసారిగా బోల్తా పడింది. మంటలు చెలరేగడంతో లారీ కూడా పూర్తిగా దగ్ధమైంది. అయితే డ్రైవర్ మాత్రం ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.
* ట్రాక్టర్‌- ద్విచక్ర వాహనం ఎదురెదురుగా ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు, ఒకరికి స్వల్ప గాయాలైన సంఘటన మండలంలోని రాజంపల్లి గ్రామ సమీపంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది.
*ప్రేమించిన యువతి తనను ప్రేమించలేదన్న మనస్థాపంతో ప్రేమికుడు చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన పెద్దాపురం పట్టణం కొత్తపేట చెరువు వద్ద ( బోట్‌ క్లబ్‌ ) మంగళవారం చోటు చేసుకుంది.