*భాజపా ఎంపీ కిషన్ రెడ్డికి తెలంగాణా కోటా రేసులో కేంద్ర మంత్రి పదవి ఖాయమంతున్నాయి పార్టీ వర్గాలు లష్కర్ నుంచి భారీ మెజార్టీతో గెలిచినందున కీలక శాఖ దక్కుతుందని చర్చ సాగుతోంది. ప్రధాని మోడీకి సన్నిహితుడిగా పార్టీకి విధేయుడిగా పేరున్నందున మంత్రి పదవి వస్తుందన్న నమ్మకంతో నేతలున్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ప్రత్యమన్యంగా ఎదగాలని యత్నిస్తున్న పార్టీ కిషన్ రెడ్డికి ప్రదాన్యమిస్తుందని భావిస్తుంది.
*జగన్ ప్రమాణానికి వచ్చేది వీరే
ప్రధాని నరేంద్రమోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రత్యేకంగా కలిసి ప్రమాణ స్వీకారోత్సవానికి జగన్ ఆహ్వానించిన విషయం తెలిసిందే. తాజాగా బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, డీఎంకే అధినేత స్టాలిన్, జనసేన అధినేత పవన్ కల్యాణ్, సినీనటుడు చిరంజీవి, కాంగ్రెస్ నేత కేవీపీ రాంచందర్‌రావు, తదితరులకు ఫోన్ చేసి కార్యక్రమానికి హాజరుకావాలని కోరారు. మంగళవారం టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి ఫోన్ చేసిన జగన్ తన ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. మోహన్ బాబు, బాలకృష్ణ, అక్కినేని నాగార్జునతో పాటు టాలీవుడ్ ప్రముఖులకు ప్రత్యేక ఆహ్వానం అందినట్లు తెలిసింది.
*జగన్ కు అభినందనలు తెలిపనున్న తెదేపా నేతలు
తెలుగుదేశం పార్టీ తరఫున త్రిసభ్య నేతల ప్రతినిధి బృందం కాబోయే ముఖ్యమంత్రి జగన్‌కు అభినందనలు తెలియజేయనుంది. తెదేపా సీనియర్ నేతలు కింజారపు అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, గంటా శ్రీనివాసరావు గురువారం తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్లి అభినందనలు తెలియజేయనున్నారు.
* రాహుల్‌ను కలిసేందుకు వెళ్తున్నా: కుమారస్వామి
కర్ణాటక లోక్‌సభ ఎన్నికల్లో సాధించిన గెలుపుతో ఉత్సాహంలో ఉన్న బీజేపీ రాష్ట్రంలోని కాంగ్రెస్-జేడీఎస్ సర్కార్ కూలిపోవడం తథ్యమని ఓవైపు చెబుతుండటంమరోవైపు దేశవ్యాప్త నిరాశాజనక ఫలితాలతో పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ రాజీనామా వ్యవహారం హస్తినలో వేడెక్కుతున్న నేపథ్యంలో కర్ణాటక సీఎం హెచ్‌డీ కుమారస్వామి హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వెళ్తున్నాయి. గురువారంనాడు తాను రాహుల్‌ను కలుసుకోనున్నట్టు మీడియాకు ఆయన తెలిపారు. రాహుల్ గాంధీని కలుసుకుని ఆయన రాజీనామా నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరనున్నట్టు చెప్పారు. రాహుల్ రాజీనామా చేయాల్సిన అవసరం ఎంతమాత్రం లేదనిఈ విషయమై ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తానని సీఎం తెలిపారు.
*ఒడిశా సీఎంగా నవీన్ పట్నాయక్ ప్రమాణం
బీజూ జనతా దళ్ అధినేత నవీన్ పట్నాయక్ ఒడిశా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. పట్నాయక్ చేత ఆ రాష్ర్ట గవర్నర్ గణేషి లాల్ ప్రమాణస్వీకారం చేయించారు. నవీన్ పట్నాయక్ సీఎంగా ప్రమాణం చేయడం వరుసగా ఇది ఐదోసారి. భువనేశ్వర్‌లోని ఎగ్జిబిషన్ మైదానంలో ప్రమాణస్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. నవీన్ పట్నాయక్‌తో పాటు 21 మంది ఎమ్మెల్యేలుగా మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. పట్నాయక్ మంత్రి వర్గంలో ఈ సారి 10 మంది కొత్తవారికి చోటు లభించింది. 147 స్థానాలున్న ఒడిశా శాసనసభలో బీజేడీ 112 సీట్లు సాధించింది. బీజేపీ శాసనసభ ఎన్నికల్లో వరుసగా ఐదోసారి అధికారంలోకి వచ్చింది బీజూ జనతా దళ్.
*జగన్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి నేను వేళ్ళను : చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తన ప్రమాణస్వీకారానికి హాజరు కావాలని వైసీపీ అధినేత జగన్ చంద్రబాబును కోరిన సంగతి తెలిసిందే. ఇటీవల చంద్రబాబుకు ఫోన్ చేసిన జగన్ ప్రమాణస్వీకారానికి రావాలని కోరారు. మరోవైపు ఈరోజు టీడీపీ నేతలు చంద్రబాబును టీడీపీఎల్పీ నేతగా ఎన్నుకున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. వైఎస్ జగన్ ప్రమాణస్వీకారోత్సవానికి హాజరుకాకూడదని నిర్ణయించుకున్నారు.తనకు బదులుగా ఇద్దరు టీడీపీ సీనియర్ నేతలతో కూడిన ప్రతినిధి బృంవదాన్ని పంపాలని నిర్ణయించారు. కాగా, ఈ ఇద్దరు నేతలు రేపు ఉదయం తాడేపల్లిలోని జగన్ ఇంటికి వెళ్లి అభినందిస్తారని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. అనంతరం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగే జగన్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరవుతారు
*తెరాస పని అయిపోయింది: భట్టి
లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో తెరాస పని అయిపోయిందని తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయాలని కేసీఆర్ ప్రయత్నించారన్న భట్టి.. ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసిన తెరాసకు ప్రజలు బుద్దిచెప్పారని విమర్శించారు.కేసీఆర్, కేటీఆర్ చేస్తున్న పార్టీ ఫిరాయింపులను ప్రజలు అసహ్యించుకున్నారని, లోక్‌సభ ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనమని భట్టి తెలిపారు. తెరాస ఒంటెద్దు పోకడలకు 2023లోనూ ప్రజలు బుద్ది చెబుతారని ఆయన జోస్యం చెప్పారు.
*రెండోసారి ప్రమాణస్వీకారం చేసిన పెమాఖండూ
అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పెమాఖండూ రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ బీడీ మిశ్రా ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. 60 మంది సభ్యులున్న అరుణాచల్‌ప్రదేశ్ శాసనసభలో భాజపా 41 స్థానాలు గెలిచింది. దీంతో భారతీయ జనతాపార్టీ తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. సోమవారం జరిగిన శాసనసభాపక్ష సమావేశంలో భాజపా ఎమ్మెల్యేలు తమ నేతగా ఖండూను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
*జులై 12న కోర్టుకు హాజరవ్వండి
పరువు నష్టం దావాకు సంబంధించి జులై 12న న్యాయస్థానం ఎదుట హాజరు కావాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి అహ్మదాబాద్ కోర్టు ఆదేశాలిచ్చింది. నోట్ల రద్దు సమయంలో అహ్మదాబాద్ జిల్లా సహకార బ్యాంకు, ఆ బ్యాంకు ఛైర్మన్ అజయ్ పటేల్ రూ.745.59 కోట్ల విలువైన రద్దయిన నోట్లను మార్చుకున్నారని గత ఏడాది రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సుర్జేవాలా పలుమార్లు ఆరోపించారు.
*కాంగ్రెస్, భాజపాల కుమ్మక్కు వల్లనే కవిత ఓటమి
సభ ఎన్నికల్లో విచిత్రమైన ఫలితాలు వచ్చాయని, రకరకాల కారణాల వల్ల తాము ఆశించిన విధంగా స్థానాలు దక్కలేదని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. గత లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే ఓట్లు పెరిగినా స్థానాలు తగ్గాయని, శాసనసభ ఫలితాలతో పోలిస్తే ఓట్లు తగ్గాయని వివరించారు. ఇలాంటి ఫలితాలను అటు కాంగ్రెస్, ఇటు భాజపాలు సైతం ఊహించలేదని అన్నారు. ‘‘మల్కాజిగిరిలో కాంగ్రెస్ అతి తక్కువ మెజారిటీతో గెలిచింది. రేవంత్‌రెడ్డిది ఒక గెలుపు కానే కాదు. ఆదిలాబాద్‌లో భాజపా విజయాన్ని ఆ పార్టీ నేతలే నమ్మడం లేదు.
*రాహుల్ రాజీనామాపై అదే అనిశ్చితి
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా విషయంలో అనిశ్చితి కొనసాగుతోంది. పదవి నుంచి వైదొలిగే విషయంలో వెనక్కి తగ్గేది లేదన్న సంకేతాలను ఆయన ఇచ్చారు. రాహుల్ రాజీనామాను తిరస్కరిస్తూ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) చేసిన తీర్మానం యథాతథంగానే ఉందని ఆ పార్టీ పేర్కొంది. రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ స్వపక్షంతోపాటు మిత్రపక్షాల నుంచి రాహుల్‌కు బుజ్జగింపులు పెరుగుతున్నాయి.
*ఎన్టీఆర్ సంస్కరణలు మరవలేనివి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నటుడు నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్విటర్ వేదికగా మంగళవారం నివాళులర్పించారు. ‘‘ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆ మహనీయుడి స్మృతికి నివాళులర్పిస్తున్నా. మహిళా సాధికారత, పేదల సంక్షేమం, వెనకబడిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి, చేపట్టిన సంస్కరణలు మరవలేనివి. ఎన్టీఆర్ క్రమశిక్షణ, అంకితభావం ఆదర్శనీయం. భారతదేశ యవనికపై తెలుగు వారికి ప్రత్యేక గుర్తింపు సాధించేలా కృషి చేశారు. ఆ కృషే తెలుగు ప్రజల గుండెల్లో ఎన్టీఆర్‌కు గొప్పస్థానాన్ని సంపాదించి పెట్టింది’’ అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్వీట్ చేశారు.
*మంత్రివర్గ కూర్పుపై మోదీ, షా భేటీ
ప్రధాన మంత్రిగా రెండో సారి బాధ్యతలు స్వీకరించనున్న నరేంద్ర మోదీతో భాజపా అధ్యక్షుడు అమిత్ షా మంగళవారం భేటీ అయ్యారు. గురువారం ప్రధాని నరేంద్ర మోదీతో పాటు మంత్రులుగా ఎవరెవరు ప్రమాణ స్వీకారం చేయాలి అనే అంశంపై నేతలిద్దరూ చర్చించుకున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఏదీ వెలువడనప్పటికీ కొత్త మంత్రి మండలి కూర్పు ఎలా ఉండాలి, కొత్తగా ఎవరెవరికి అవకాశం కల్పించాలి, రద్దుకానున్న ప్రభుత్వంలోని మంత్రుల్లో ఎవరెవరిని కొనసాగించాలి అనే విషయాలపైనా వారు మాట్లాడుకొని ఉండవచ్చని భావిస్తున్నారు.
*తెరాసకు ప్రత్యామ్నాయం కాంగ్రెస్సే
తెలంగాణలో తెరాసకు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీయేనని టీపీసీసీ అధ్యక్షుడు, నల్గొండ ఎంపీగా గెలిచిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టంచేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను నాశనం చేయాలని చూసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నాలుగు నెలల్లోనే ప్రజలు గుణపాఠం చెప్పారని ధ్వజమెత్తారు. ఇతర పార్టీల్లో గెలిచిన ఎమ్మెల్యేలను తెరాసలో చేర్చుకోవడం వంటి అనైతిక చర్యలపై తగిన విధంగా స్పందించారని పేర్కొన్నారు. ఎంపీలుగా గెలిచిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి మంగళవారం గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
*తెదేపా శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు
తెదేపా శాసనసభాపక్ష సమావేశం బుధవారం ఉదయం 10.30 గంటలకు ఉండవల్లిలోని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నివాసంలో జరగనుంది. పార్టీ శాసనసభాపక్ష నేతగా చంద్రబాబును ఎన్నుకోనున్నారు. శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు ఉండకపోవచ్చని, సీనియర్ సభ్యుడు ఎవరికైనా అవకాశమిస్తారని ఊహాగానాలు కొనసాగాయి. వాటికి తెరదించుతూ..శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు వ్యవహరించనున్నట్టు పార్టీ వర్గాలు మంగళవారం ధ్రువీకరించాయి.
*మంత్రివర్గ కూర్పుపై మోదీ, షా భేటీ
ప్రధాన మంత్రిగా రెండో సారి బాధ్యతలు స్వీకరించనున్న నరేంద్ర మోదీతో భాజపా అధ్యక్షుడు అమిత్ షా మంగళవారం భేటీ అయ్యారు. గురువారం ప్రధాని నరేంద్ర మోదీతో పాటు మంత్రులుగా ఎవరెవరు ప్రమాణ స్వీకారం చేయాలి అనే అంశంపై నేతలిద్దరూ చర్చించుకున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఏదీ వెలువడనప్పటికీ కొత్త మంత్రి మండలి కూర్పు ఎలా ఉండాలి, కొత్తగా ఎవరెవరికి అవకాశం కల్పించాలి, రద్దుకానున్న ప్రభుత్వంలోని మంత్రుల్లో ఎవరెవరిని కొనసాగించాలి అనే విషయాలపైనా వారు మాట్లాడుకొని ఉండవచ్చని భావిస్తున్నారు.
*తెదేపా శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు
తెదేపా శాసనసభాపక్ష సమావేశం బుధవారం ఉదయం 10.30 గంటలకు ఉండవల్లిలోని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నివాసంలో జరగనుంది. పార్టీ శాసనసభాపక్ష నేతగా చంద్రబాబును ఎన్నుకోనున్నారు. శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు ఉండకపోవచ్చని, సీనియర్ సభ్యుడు ఎవరికైనా అవకాశమిస్తారని ఊహాగానాలు కొనసాగాయి. వాటికి తెరదించుతూ..శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు వ్యవహరించనున్నట్టు పార్టీ వర్గాలు మంగళవారం ధ్రువీకరించాయి.
*పార్టీ అధ్యక్షుడిగా రాహుల్‌గాంధీ కొనసాగాలి: భట్టివిక్రమార్క
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా రాహుల్‌గాంధీ కొనసాగాలని ఆ పార్టీ శాసనసభాపక్షనేత మల్లు భట్టివిక్రమార్క మంగళవారం ఓ ప్రకటనలో కోరారు. పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ సమర్థంగా పని చేశారని, అధ్యక్ష పదవికి ఆయన రాజీనామా చేయాల్సిన అవసరం ఏ మాత్రం లేదన్నారు. పార్టీ అభివృద్ధి కోసం వ్యక్తిగత జీవితాన్ని, సర్వస్వాన్ని రాహుల్ త్యాగం చేస్తున్నారని.. పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తున్న ఆయనకు ప్రతీ నాయకుడు, కార్యకర్త సహకారం అందించాలన్నారు. రాహుల్ స్ఫూర్తిని, ఆలోచనలను నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని భట్టి పేర్కొన్నారు.
*నిజామాబాద్ రైతులే స్ఫూర్తి కావాలి
రైతు సమస్యల పరిష్కారం కోసం నిజామాబాద్ రైతులు చూపిన పోరాట పటిమను స్ఫూర్తిగా తీసుకుని యావత్ తెలంగాణ అన్నదాతలు ముందుకు సాగాలని తెజస అధ్యక్షుడు ఆచార్య కోదండరాం పిలుపునిచ్చారు. వరంగల్ నగరంలోని ఆజంజాహి మైదానంలో మంగళవారం రాత్రి ఆలిండియా కిసాన్ ఫెడరేషన్ (ఏఐకేఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహించిన 2వ జాతీయ రైతు మహాసభలో ముఖ్యఅతిథిగా ఆయన మాట్లాడారు. ఎర్రజొన్న, పసుపు రైతులు ఉద్యమాల వైపు ఎలా వచ్చారో ఆయన వివరించారు.
*స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కండి
స్థానిక సంస్థల ఎన్నికలకు అందరూ సిద్ధంగా ఉండాలని తెదేపా ప్రధానకార్యదర్శి నారా లోకేశ్ కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు. మంగళగిరి నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన ఎన్టీఆర్ జయంతి కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఎమ్మెల్సీగా ఉండి ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తానని, శ్రేణులకు అండగా ఉంటానని లోకేశ్ చెప్పారు. కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత తనదని చెప్పారు.
*కుమారస్వామి ప్రభుత్వం త్వరలో కూలుతుంది
కర్ణాటకలో కుమారస్వామి ప్రభుత్వం త్వరలో కూలిపోతుందని ఆ రాష్ట్ర మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డి జోస్యం చెప్పారు. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలకు ఓటర్లు గట్టిగా బుద్ధి చెప్పారని వ్యాఖ్యానించారు. ఘోర ఓటమి చెందిన ఆ రెండు పార్టీల మధ్య లుకలుకలు ప్రారంభమయ్యాయని.. ఇక ఎన్నో రోజులు ఆ ప్రభుత్వం అధికారంలో ఉండదని అభిప్రాయపడ్డారు.
*రాహుల్ జూలై 12న విచారణకు రండి
పరువునష్టం దావా కేసులో జూలై 12న కోర్టుకు హాజరు కావాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని గుజరాత్ కోర్టు ఆదేశించింది. పెద్దనోట్లను రద్దు చేసిన ఐదు రోజుల్లోపే రూ.745.59 కోట్ల విలువైన పాతనోట్లను అహ్మదాబాద్ జిల్లా సహకార బ్యాంకు మార్చిందని రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా ఆరోపించారు. వీరి ఆరోపణలను ఖండిస్తూ బ్యాంకు చైర్మన్ అజయ్ పటేల్, అధికారులు వారిపై పరువునష్టం దావా వేశారు. ఈ నెల 27న విచారణకు హాజరు కావాలని అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ర్టేట్, రాహుల్‌కు సమన్లు జారీ చేశారు. అయితే ఆ రోజు మాజీ ప్రధాని నెహ్రూ వర్ధంతి ఉండటంతో.. జూలై 12న విచారణకు హాజరు కావాలని కోర్టు స్పష్టం చేసింది.
కిషన్‌రెడ్డికు కేంద్ర మంత్రి పదవి-రాజకీయ-05/29
Related tags :