నార్త్ కరోలినా రాష్టంలోని షార్లెట్ నగరంలో ఎన్నారై టిడిపి ఆద్వర్యంలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి నిర్వహించారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, తెలుగు ప్రజల ఆరాధ్య దైవం, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలచిన నాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు 96వ జయంతి సందర్భంగా షార్లెట్ నగరంలో ఎన్నారై టిడిపి ఆద్వర్యం లో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసారు. ఈ కార్య క్రమం లో ఎన్టీఆర్ అభిమానులు, నందమూరి అభిమానులు, బాలకృష్ణ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
ఉత్తర కరోలినాలో NTR జయంతి వేడుకలు
Related tags :