వంట గదిలో సింకు దగ్గరో.. హాలులోని వాష్ బేసిన్ కిందో నీళ్లు కారడం వల్ల జరిగే ప్రమాదాలు అప్పుడప్పుడూ చూస్తుంటాం. అలాంటప్పుడు నీళ్లు లీకవుతున్న విషయాన్ని తెలుసుకుంటే బాగుంటుంది కదూ. ఇలాంటి స్మార్ట్ ఆలోచనకి రూపమే ‘ఫిబారో ఫ్లడ్ సెన్సర్’ పరికరం. దీన్ని నీళ్ల లీకేజీకి ఆస్కారం ఉన్న చోట ఉంచితే చాలు. తడిని గుర్తించిన వెంటనే స్మార్ట్ ఫోన్‌కి అలర్ట్‌ని పంపుతుంది. అంతేకాదు.. ప్రత్యేక వ్యవస్థతో ఇంట్లో నీటి సరఫరాని నిలిపేస్తుంది కూడా. ఒక్క లీకేజీ సెన్సర్గానే కాకుండా అసాధారణమైన వేడిని గ్రహిస్తే వెంటనే గది ఉష్ణోగ్రతని సూచిస్తూ నోటిఫికేషన్ పంపుతుంది. ఇంకా చెప్పాలంటే.. అసాధారణమైన కదలికలు ఏర్పడి పరికరం కదిలి ఎటైనా జరిగితే వినియోగదారుల్ని అలెర్ట్ చేస్తుంది.
తేమ తగిలితే కెవ్వుమంటుంది
Related tags :