ఆస్తమా, ఉబ్బసం శ్వాసకోశ వ్యాధిగ్రస్తులకు బత్తిన మృగశిర ట్రస్ట్ పంపిణిచేసే చేప ప్రసాద వితరణను ఈ సారి జూన్ 8న చేపట్టనున్నట్లు ట్రస్ట్ కార్యదర్శి బత్తిని హరినాథ్‌గౌడ్ తెలిపారు. ప్రతి సారిలాగే ఈ సారి కూడా నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలోనే చేప ప్రసాదాన్ని పంపిణీ చేయనున్నామన్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ట్రస్టు సభ్యులతో కలిసి చేప ప్రసాద పంపిణీ వివరాలను మీడియాకు వెల్లడించారు. వంశపారంపర్యంగా తాము తయారుచేస్తున్న ప్రసాదాన్ని రోగులకు ఉచితంగా అందించనుండగా, మత్స్య శాఖ సరఫరా చేసే కొరమీను చేపలను కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ సారి మొత్తం 36 కౌంటర్లల్లో ప్రసాదాన్ని పంపిణీచేయనున్నామని, వీఐపీలు, దివ్యాం గులు, పిల్లల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నామన్నారు. ట్రస్టుసభ్యులు శివా నం ద్‌గౌడ్, గౌరిశంకర్‌గౌడ్, సంతోష్‌గౌడ్, అమర్‌నాథ్‌గౌడ్, వర్ధన్‌గౌడ్ పాల్గొన్నారు.
సాయంత్రం నుంచి షురూ..
మృగశిర కార్తే రోజున ప్రతీ సారి ఉదయం 8 గంటల నుంచి చేప ప్రసాద పంపిణీని ప్రారంభిస్తుండగా, ఈ సారి సాయంత్రం నుంచి ప్రసాదాన్ని పంపిణీ చేయనున్నామని బత్తిని హరినాథ్‌గౌడ్ వెల్లడించారు. మృగశిర కార్తె సాయంత్రం 6 గంటల నుం చి ప్రవేశించనున్న దృష్ట్యా ప్రసాదాన్ని సాయంత్రం 6 గంటల నుంచే ప్రారంభించనున్న మన్నారు. జూన్ 8న సాయంత్రం 6 గంటల నుంచి ప్రారంభమైన పంపిణీ మరుసటి రోజు సాయంత్రం 6 గంటల వరకు 24 గంటల పాటు నిరాటంకంగా కొనసాగుతుం దన్నారు. చేప ప్రసాదాన్ని స్వీకరించిన వారంతా జూన్ 23, జూలై 7, జూలై 21 తేదీల్లో కార్తె ప్రసాదాన్ని స్వీకరించాల్సి ఉంటుందన్నారు. తామిచ్చిన మూళికల ప్రసాదాన్ని ఉండలుగా చేసుకుని, రోగులు తీసుకోవాలని సూచించారు.
2 లక్షల చేప పిల్లలు..
చేప ప్రసాద వితరకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తున్నది, ప్రత్యేకించి మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పర్యవేక్షణ జరుపుతూ విజయవంతం చేయడా నికి సహకరిస్తున్నారని హరినాథ్‌గౌడ్ తెలిపారు. మత్స్యశాఖ 2 లక్షల చేప పిల్లలను అందుబాటులో ఉంచనుండగా, ఆర్‌అండ్‌బీ, రవాణా, జీహెచ్‌ఎంసీ, విద్యు త్తు, అగ్ని మాపకశాఖలు తమ వంతుగా అన్ని రకాల ఏర్పాట్లను చేస్తున్నాయన్నారు. దేశ విదేశాల తో పాటు పలు రాష్ర్టాల నుంచి వచ్చేరోగుల కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామ న్నారు. బద్రివిశాల్ పన్నాలాల్ ట్రస్ట్, పిత్తి ట్రస్ట్, అగర్వాల్ సేవాదల్‌లు ప్రతిసారిలాగే భోజనం, ఫలహారాలు, మజ్జిగ, నీటిని సరఫరా చేసేందుకు ముందుకొచ్చాయన్నారు.
ముగిశాక నాలుగు ప్రాంతాల్లో..
ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో చేప ప్రసాద వితరణ ముగిసిన తర్వాత మరునాడు తమ ఇండ్లల్లో ఒక రోజు పాటు ప్రసాదాన్ని పంపిణీ చేయనున్నట్లు హరినాథ్‌గౌడ్ తెలిపారు. దూద్‌బౌలిలోని తమ ఇంటితో పాటు, తమ కుటుంభసభ్యులు నివాసముంటున్న కవాడిగూడ (కల్పన థియేటర్ సమీపంలో), వనస్థలిపురం (వాటర్‌ట్యాంక్ సమీపం లో), కూకట్‌పల్లి (బాలాజీనగర్)లలో సైతం ఒక రోజు పాటు ప్రసాదాన్ని ఉచితంగా అందజేయనున్నామన్నారు.