*పట్టాలపై నిలిచిన వాహనాలను తప్పించేందుకు రైలు డ్రైవర్ అప్రమత్తతతో వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా కొత్తపల్లి సమీపంలో రైల్వే గేటు దాటేందుకు పట్టాల మీదుగా వెళ్తున్న రెండు వాహనాలు మధ్యలోకి వెళ్లేసరికి అవతలివైపు గేటు పడటం కలకలం రేపింది.
* వర్షం వస్తుందని చెట్టుకింద నిల్చున్న ఇద్దరిపై పిడుగు పడటంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలం కోగిలేరు పంచాయతీ బసవరాజు కండ్రిగ గ్రామంలో బుధవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది.
*ఉత్తర్ ప్రదేశ్‌లోని బారాబంకీ జిల్లాలో కల్తీ మద్యం తాగిన ఘటనలో మృతుల సంఖ్య 17కి పెరిగింది. లఖ్‌నవూకు 60 కిలోమీటర్ల దూరంలోని రామ్‌నగర్‌లో ఉన్న మద్యం దుకాణంలో సోమవారం రాత్రి పలువురు మద్యం తాగారు.
* అటవీ భూముల్లో అక్రమంగా చేపడుతున్న సాగును అడ్డుకునేందుకు యత్నించిన తమపై గిరిజనులు దాడి చేశారని అటవీ శాఖ సిబ్బంది తెలిపారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం యాచారం తండా శివారులో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది.
* ఓ బర్రె మృతి చెందడంతో అధికారుల అక్రమాలు బయటపడ్డాయి. అదెలాగంటారా.. కేంద్ర ప్రభుత్వ పథకమైన పీఎంఎస్‌కేవై ద్వారా వ్యవసాయ శాఖ అధికారులు కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం పెద్దగుల్లా గ్రామానికి చెందిన 22 మంది రైతులకు ఒక్కొక్కరికి రెండు చొప్పున 44 గేదెలను అందజేశారు.
* కర్నూలు సమీపంలోని ఉలిందకొండ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా… మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి.
*విజయవాడ ఇంద్రకీలాద్రిపై మద్యం మత్తులో ఉన్న ఓ యువకుడు ప్రమాదవశాత్తు కిందకు జారిపడిన ఘటన బుధవారం స్థానికంగా కలకలం రేపింది.
*అసోంలో దారుణం చోటుచేసుకుంది. భర్త వేధింపులను ఏన్నో ఏళ్లుగా భరిస్తున్న ఓ మహిళ సహనం కోల్పోయింది. ఎంత సర్దిచెప్పినా లాభం లేకపోవడంతో అతన్ని చంపడమే తనకు విముక్తి అని భావించింది. ఏకంగా భర్త తల నరికి పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది.
*ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫతేనగర్‌కు చెందిన హర్షిత తాను ప్రేమించిన యువకుడ్ని వివాహం చేసుకునేందుకు తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. తన ప్రేయసి మరణవార్తను విన్న ప్రియుడు రమేష్ హర్షిత నివాసానికి సమీపంలోని ఓ భవనంపై నుంచి దూకి బుధవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
*లిప్టు వద్ద పనులు చేస్తూ ప్రమాదానికి గురైన మేస్త్రి ఆస్పత్రికి తీసుకువెళ్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. ఈ ఘటన వాణినగర్ రెండోవీధిలోని వరుణ్ టవర్సులో మంగళవారం రాత్రి జరిగింది.
* ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న ఘటన ముజఫర్‌నగర్ జిల్లాలో జరిగింది. షామిలీ జిల్లాలోని జమాల్ పూర్ గ్రామంలో 36ఏళ్ల రచన అనే మహిళ కూల్‌డ్రింక్‌లో విషం కలిపి పిల్లలకు ఇచ్చిన తర్వాత తను కూడా సేవించింది.
మందు మైకంలో ఇంద్రకీలాద్రిపై నుండి కిందైకి దొర్లిన యువకుడు-నేరవార్తలు-05/30
Related tags :