ఐశ్వర్యం అంటే….
?ఎక్కడ పోతుందో అని లాకర్లలో దాచుకునే భయం, ఐశ్వర్యమా?_*
? లేక ఎప్పుడు మనతో నే ఉంటుంది అనే ధైర్యం ఐశ్వర్యమా!_*
? ఐశ్వర్యం అంటే నోట్ల కట్టలు ,తరాజు లోని తులాల బంగారాలు కాదు…!_*
?ఇంటి గడపలలో ఆడపిల్ల గజ్జల చప్పుడు “ఐశ్వర్యం”!_*
?ఇంటికిరాగానే చిరునవ్వుతో ఎదురొచ్చే భార్య “ఐశ్వర్యం”!_*
?ఎంత ఎదిగినా,నాన్న తిట్టే తిట్లు “ఐశ్వర్యం”!_*
?అమ్మ చేతి ఆవకాయ ఐశ్వర్యం, భార్య చూసే ఓర చూపు “ఐశ్వర్యం”!_*
? పచ్చటి చెట్టు,పంటపొలాలు ఐశ్వర్యం,వెచ్చటి సూర్యుడు “ఐశ్వర్యం”!_*
?పౌర్ణమి నాడు జాబిల్లి “ఐశ్వర్యం”!_*
?మనచుట్టూ ఉన్న పంచభూతాలు ఐశ్వర్యం”!
?పాల బుగ్గల చిన్నారి చిరునవ్వు “ఐశ్వర్యం”!_*
?ప్రకృతి అందం ఐశ్వర్యం,పెదాలు పండించే నవ్వు “ఐశ్వర్యం”!_*
?అవసరంలో ఆదరించే ప్రాణస్నేహితుడు “ఐశ్వర్యం”!_*
?బుద్ధికలిగిన బిడ్డలు “ఐశ్వర్యం”!_*
?బిడ్డలకొచ్చే చదువు “ఐశ్వర్యం”!_*
?భగవంతుడిచ్చిన ఆరోగ్యం “ఐశ్వర్యం”!_*
?చాలామందికన్నా ఉన్నతంగా ఉన్నామనుకునే తృప్తి “ఐశ్వర్యం”!_*
?పరులకు సాయంచేసే మనసు మన “ఐశ్వర్యం”!_*
?*ఐశ్వర్యం అంటే చేతులు
లేక్కేట్టే కాసులు కాదు,*
?కళ్ళు చూపెట్టే ప్రపంచం ఐశ్వర్యం
?మనసు పొందే సంతోషం ఐశ్వర్యం
???????