రైతులు సేంద్రియ వ్యవసాయం మీద దృష్టిసారించాలని ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేటలో పలువురి రైతులకు హరీశ్‌రావు నేడు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ భూదస్ర్తాల ప్రక్షాళన పారదర్శకంగా చేశారన్నారు. రెవెన్యూ ప్రక్షాళన 95 శాతం పూర్తయిందన్నారు. రెవెన్యూ కార్యాలయాలే రిజిస్ట్రేషన్ కార్యాలయాలుగా మారుతున్నాయన్నారు. అవినీతికి ఆస్కారం లేకుండా రెవెన్యూ ప్రక్షాళన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పాసుపుస్తకాలు ఉన్న రైతులందరికీ రూ. 10 వేల రైతుబంధు అందజేయనున్నట్లు చెప్పారు. రసాయనిక ఎరువుల వల్ల క్యాన్సర్ వంటి రోగాలు వస్తున్నాయని.. కావునా రైతులు సేంద్రియ వ్యవసాయం మీద దృష్టిసారించాలని సూచించారు. రైతులకు 100 శాతం సబ్సిడీపై గొర్రెలు, బర్రెలకు షెడ్లు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. రైతులు పొలం గట్టుమీద విస్తృతంగా మొక్కలు నాటాలని పేర్కొన్నారు.
తెలంగాణా రైతులు సేంద్రీయ పద్ధతులను అవలింబించాలి
Related tags :