ScienceAndTech

భారత నౌకాదళానికి నూతన చీఫ్

Indian navy gets new chief

భార‌త నౌకాద‌ళ చీఫ్‌గా అడ్మిర‌ల్ క‌రంబీర్ సింగ్ ఇవాళ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఢిల్లీలోని సౌత్ బ్లాక్‌లో ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది.

అడ్మిర‌ల్ సునిల్ లంబా నుంచి క‌రంబీర్ బాధ్య‌త‌లు స్వీక‌రించారు.

24వ నేవీ చీఫ్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించ‌డం గొప్ప గౌర‌వంగా భావిస్తాన‌ని క‌రంబీర్ తెలిపారు.

అడ్మిర‌ల్ సునిల్ లంబా.. భార‌త నౌకాద‌ళాన్ని ఎంతో ప‌టిష్టం చేశార‌ని, నేవీకి ఆయ‌న సేవ‌ల‌ను కొనియాడుతున్న‌ట్లు క‌రంబీర్ తెలిపారు.

మాజీ చీఫ్ అడ్మిర‌ల్ సునిల్ లంబా ఇవాళ రిటైర్ అయ్యారు. ఆయ‌న జూన్ 2016లో బాధ్య‌త‌లు స్వీక‌రించారు.

పుల్వామా ఉగ్ర‌దాడి త‌ర్వాత భార‌త నౌకాద‌ళం పాకిస్థాన్‌పై తీవ్ర వ‌త్తిడి తెచ్చిన‌ట్లు మాజీ చీఫ్ అడ్మిర‌ల్ లంబా తెలిపారు.

హిందూ మ‌హాస‌ముద్రంలో భార‌త ఆధిప‌త్యం కొన‌సాగుతోంద‌న్నారు.

భార‌త నౌకాద‌ళానికి మూడ‌వ యుద్ధ నౌక అవ‌స‌ర‌మ‌ని ఆయ‌న వెల్ల‌డించారు.