Sports

జడేజాది మాంచి ఊపు

Michael Clarke Praises Ravindra Jadeja For His Fielding Skills

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ మైకేల్‌ క్లార్క్‌ టీమిండియా ఆల్‌ రౌండర్లపై ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రపంచ కప్‌లో భాగంగా ఇప్పటి వరకు జరిగిన రెండు మ్యాచుల్లోనూ ఫీల్డర్లు మెరిశారు. మొదటి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా సారథి డుప్లెసిస్‌, ఇంగ్లాండ్‌ ఆటగాడు బెన్‌స్టోక్స్‌ అద్భుతమైన క్యాచ్‌లు పట్టారు. అయితే క్యాచ్‌ల విషయంలో క్లార్క్‌ కన్ను టీమిండియా క్రికెటర్ల మీద పడింది. ప్రస్తుతం ఉన్న ఆల్‌రౌండ్‌ ఫీల్డర్లలో టీమిండియా ఆల్ రౌండర్‌ రవీంద్ర జడేజా ప్రపంచంలోనే అత్యుత్తమ ఫీల్డర్‌ అంటూ క్లార్క్‌ కితాబిచ్చాడు. జడేజాకు మించిన మంచి ఫీల్డర్‌ను ఇంతవరకు గుర్తించలేదని క్లార్క్‌ చెప్పాడు. ‘నాకు తెలిసి రవీంద్ర జడేజా కంటే గొప్ప ఫీల్డర్‌ లేడని నా అభిప్రాయం. ఫీల్డింగ్‌లో పరుగులను అడ్డుకోవడంతోపాటు అద్భుతమైన క్యాచ్‌లు పట్టగలడు.’ అని అన్నాడు. ప్రపంచ కప్‌ ప్రారంభానికి ముందు టీమిండియా ఆడిన రెండు వార్మప్‌ మ్యాచుల్లోనూ జడేజా అదరగొట్టాడు. తొలి మ్యాచ్‌ కివీస్‌తో ఆడినప్పుడు అత్యధికంగా 54 పరుగులు చేసి జట్టు పరువు కాపాడాడు. ఇక బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వార్మప్‌ మ్యాచ్‌లోనూ జడేజా తన మార్క్‌ చూపించాడు.