Movies

నేను వదిలేశాక ఆమె తగులుకుంది

Nithya Menon Shares How Her Ego Made A Couple Get Married Nazriya

నా వల్లే ఆమె పెళ్లి జరిగింది అంటోంది నటి నిత్యామీనన్‌. సినీ పరిశ్రమలో పొగరుబోతుగా ముద్ర పడిన నటి నిత్యామీనన్‌. తనకు నచ్చితే ఎలాంటి పాత్రనైనా చేయడానికి సై అనే ఈ కేరళా కుట్టి నచ్చకపోతే ఎంత పెద్ద దర్శకుడి చిత్రానైనా నిరాకరించేస్తుంది. అలా మాతృభాషలోనూ తీవ్ర వ్యతిరేకతను మూటకట్టుకుంది. ప్రస్తుతం జయలలిత బయోపిక్‌లో టైటిల్‌ పాత్రను పోషిస్తున్న నిత్యామీనన్‌ ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టింది. నటి నజ్రియా గుర్తుండే ఉంటుంది. తిరుమణం ఎన్నుం నిక్కా, రాజారాణి వంటి కొన్ని తమిళ చిత్రాల్లో నటించిన ఈ మలయాళీ బ్యూటీ మాతృభాషలోనూ పలు చిత్రాలు చేసింది. కథానాయకిగా మంచి మార్కెట్‌ ఉండగానే నటుడు ఫాహత్‌ ఫాజిల్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. తాజాగా సినిమాలకు రీఎంట్రీ అవుతోందనుకోండి. అది వేరే విషయం.ఈమె పెళ్లికి తానే కారణం అంటోంది నటి నిత్యామీనన్‌. దీని గురించి ఈమె తెలుపుతూ బెంగళూర్‌ డేస్‌ అనే మలయాళ చిత్రంలో హీరోయిన్‌గా నటించే అవకాశం తనకే వచ్చిందని చెప్పింది. అయితే తానప్పుడు ఇతర చిత్రాలతో బిజీగా ఉండడం వల్ల ఆ చిత్రంలో నటించలేకపోయానని చెప్పింది. తాను వదులుకున్న అవకాశం ఆ తరువాత నటి నజ్రియాను వరించిందని చెప్పింది. ఆ చిత్ర షూటింగ్‌లోనే ఫాహత్‌ ఫాజిల్‌కు, నటి నజ్రియా మధ్య పరిచయం ప్రేమగా మారిందని, ఆ చిత్ర నిర్మాణం పూర్తి అయ్యేలోపే ఇద్దరూ పెళ్లి చేసుకున్నారన్న రహస్యాన్ని నిత్యామీనన్‌ బయట పెట్టింది. అంతే కాదు ఏ కార్యక్రమంలో కలిసినా నీ వల్లే మా పెళ్లి జరిగిందని నటి నజ్రియా, ఫాహత్‌ ఫాజిల్‌ గొప్పగా అంటుంటారని నిత్యామీనన్‌ చెప్పుకొచ్చింది. ఇంతకీ మీ పెళ్లి ఎప్పుడమ్మా అంటే మాత్రం దానికి ఇంకా చాలా టైమ్‌ ఉంది అంటూ దాటేసే ధోర ణిలో మాట్లాడుతోంది.