ఈనెల 13 నుంచి నిరవధిక సమ్మెకు ఏపీ ఆర్టీసీ కార్మిక సంఘాలు సన్నద్ధమవుతున్నాయి. ఈనెల 3 నుంచి 11 వరకు అన్ని జిల్లాల్లోనూ సమ్మె సన్నాహక సభలు నిర్వహించాలని సంఘాలు నిర్ణయించాయి. 3న రాజమహేంద్రవరంలో, 4న శ్రీకాకుళం, 5న విశాఖలో ఆర్టీసీ సమ్మె సన్నాహక సభలు నిర్వహించనున్నారు. 6న ఒంగోలు, 7న ఏలూరు, నెల్లూరు, తిరుపతి.. 8న కడప, 9న అనంతపురం, కర్నూలు, 10న గుంటూరు, 11న విజయవాడలో సభలు నిర్వహించాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు నిర్ణయించాయి. వేతన సవరణ బకాయిల చెల్లింపు, అద్దె బస్సుల పెంపు ఉపసంహరణ, సిబ్బంది కుదింపు తదితర మొత్తం 27 డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగుతున్నారు.
ఆర్టీసె సమ్మె సైరన్
Related tags :