తీపి, పులుపు రుచుల సమ్మేళనమైన నేరేడు పండు వేసవిలో విరివిగా లభిస్తుంది. సమ్మర్లో తినదగ్గ పండ్లలో నేరేడు కూడా ఒకటి. నేరేడు ఆకులు, బెరడును కూడా ఔషధాల తయారీలో వాడతారు. ఈ పండులోని యాంటీ ఆక్సిడెంట్స్ కేన్సర్, కాలేయ సంబంధ వ్యాధుల్ని నివారిస్తాయి. నేరేడులోని పోషకాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. దీనిలో క్యాలరీలు తక్కువ ఉంటాయి కాబట్టి హెల్తీ స్నాక్‌గా తినొచ్చు. బరువు తగ్గాలనుకునే వారికి ఇవి మంచి ఫుడ్ ఛాయిస్.నేరేడు పండు తింటే జీర్ణవ్యవస్థ చక్కగా పనిచేస్తుంది. నేరేడు పండు రసం ఫైటో కెమికల్గా పనిచేస్తుంది. ఈ రసం తాగితే కాలేయం సంబంధ వ్యాధులు తగ్గిపోతాయి.దీనిలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు నోటిని శుభ్రపరచడమే కాదు దంతాలు, చిగుళ్లను దృఢంగా చేస్తాయి కూడా.వీటిలో ప్రొటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లతో పాటు మెగ్నీషియం, పొటాషియం, ఫాస్ఫరస్ వంటి సూక్ష్మ పోషకాలు మెండుగా ఉంటాయి. ఇవి శరీరానికి పోషణనిస్తాయి.ఈ పండులో గ్లూకోజ్, ఫ్రక్టోజ్‌తో పాటు నీరు కూడా ఎక్కువే ఉంటుంది. వీటిని తింటే దాహం తీరుతుంది. అంతేకాదు శరీరం చల్లబడుతుంది కూడా.జీర్ణసంబంధమైన సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.వీటిలో కాల్షియం, ఫోలిక్ ఆమ్లం, ఐరన్ అధిక పాళ్లలో ఉంటాయి. కాబట్టి గర్భిణులు ఈ పండు తింటే వారికి అవసరమైన పోషకాలు లభిస్తాయి. ఈ పండులోని ఐరన్, విటమిన్ సి హీమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతాయి. ఫలితంగా రక్తహీనత సమస్య తగ్గుతుంది.నేరేడు పండు గుజ్జును చిగుళ్ల వ్యాధుల చికిత్సలో ఉపయోగిస్తారు. విటమిన్ సి ఎక్కువ ఉండడంతో ఈ పండు ‘గౌట్’ వ్యాధిని తగ్గిస్తుంది.రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువ కాకుండా చూస్తుంది. గుండె కండరాలు గట్టిపడకుండా చూసి, హృదయ సంబంధవ్యాధుల్ని నివారిస్తుంది.ఎండిన నేరేడు పండ్ల పొడి చర్మం మీది ఎర్రని మచ్చలను పోగొట్టి, కాంతినిస్తుంది.అస్తమా, విపరీతమైన దగ్గు వంటి జబ్బుల్ని నయం చేయడంలో నేరేడు ఉపయోగపడుతుంది.టేబుల్ స్పూన్ నేరేడు పండు రసంలో తేనె, ఉసిరి రసం కలపుకొని రోజూ ఉదయం తాగితే జ్ఞాపకశక్తి కూడా మెరుగవుతుంది.గ్లూకోజును శక్తిగా మారుస్తుంది. దాంతో రక్తంలో గ్లూకోజ్ స్థాయులు పెరిగిపోకుండా చూస్తుంది. కాబట్టి మధుమేహులు ఈ పండును డైట్లో భాగం చేసుకుంటే ఫలితం ఉంటుంది
ఈ వేసవిలో నేరేడు గుజ్జు తింటే….
Related tags :